నిజామాబాద్ జిల్లా కేంద్రంతో పాటు ఆర్మూర్ పట్టణంలో పలువురు వడ్డీ వ్యాపారస్తుల ఇండ్లపై పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.
ఇటీవల జిల్లాలో పేదల నడ్డి విరుస్తున్న వడ్డి వ్యాపారస్తులపై సిపి సాయి చైతన్య దృష్టి సారించారు. అధిక వడ్డీలకు డబ్బులు ఇస్తూ శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్న వడ్డీ వ్యాపారస్తులను గుర్తించి వారి ఇండ్లను సోదా చేశారు.
ఆర్మూర్ పట్టణంలోని పలు కాలనీలలో వడ్డీ వ్యాపారస్తుల ఇండ్లపై జిల్లా సిపి ఆదేశాల మేరకు పది బృందాలుగా విడిపోయి సోదాలు నిర్వహించారు.
ఉదయం ఐదు గంటల నుండి పట్టణంలోని పలు ప్రాంతాల్లో సోదాలు చేసి ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. అలాగే నిజామాబాద్ నగరంలో 12 మందికి పైగా వడ్డీ వ్యాపారస్తులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
