తెలంగాణ యూనివర్సిటీలోని డిచ్పిల్లి మెయిన్ క్యాంపస్, భిక్కనూర్ సౌత్ క్యాంపస్, సారంగాపూర్ క్యాంపస్లతో పాటు అనుబంధ డిగ్రీ, పీజీ కళాశాలలకు వేసవి సెలవులను పొడిగించినట్లు యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య యాదగిరి సర్క్యులర్ జారీ చేశారు.
యూనివర్సిటీ పరిధిలోని కళాశాలలు జూన్ 1వ తేదీన పునఃప్రారంభం కావాల్సి ఉండగా జూన్ 8న ప్రారంభం అవుతాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. విద్యార్థులు, అధ్యా పకులు గమనించాలన్నారు.
