Saturday, April 18, 2026
HomeTelanganaNizamabadఓట్ చోరి కాదు..రాహుల్ గాంధీ బ్రెయిన్ చోరి..బీసీ లకు 42 శాతం రిజర్వేషన్లు కట్టబెట్టాలని బీజేపీ...

ఓట్ చోరి కాదు..రాహుల్ గాంధీ బ్రెయిన్ చోరి..బీసీ లకు 42 శాతం రిజర్వేషన్లు కట్టబెట్టాలని బీజేపీ చూస్తుంది- బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు

రాష్ట్రంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ లు ఒక్కటే..

రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ జెండా ఎగరడం ఖాయం

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు

ఓట్ చోరి అంటూ కాంగ్రెస్ కొత్త డ్రామాకు లేపారు.కానీ అది రాహుల్ గాంధీ బ్రెయిన్ చోరి అయ్యిందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు.ఓటు చోరి అంటున్న కాంగ్రెస్ రాష్ట్రంలో 8 స్థానాలు ఎలా గెలిచిందని ఆయన ప్రశ్నించారు.

దేశంలో అందరూ ఒకే ఓటు లిస్ట్ తో గెలిచారనీ తెలిపారు. ఇక బీసీ లకు బీజేపీ పార్టీ 42 శాతం రిజర్వేషన్లు కట్టబెట్టాలని చూస్తుందనీ అన్నారు.కానీ కాంగ్రెస్ ముస్లిం లకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించాలని చేస్తుంది.అందుకే మతపరమైన రిజర్వేషన్ లకు బీజేపీ పార్టీ దూరంగా ఉంటుందని తెలిపారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి నియామకం తర్వాత మొదటి సారి జిల్లాకు వచ్చారు.

ఈ సందర్భంగా ఆయనకు ఇందల్వాయి టోల్ వద్ద నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్,ఎమ్మెల్యే దన్ పాల్ సూర్యనారాయణ, దినేష్ కులాచారి,బీజేపీ నేతలు కార్యకర్తలు భారీ సంఖ్య లో తరలి వచ్చారు అయన కి ఘన స్వాగతం పలికారు. దీంతో ఇందల్వాయి టోల్ గేట్ నుంచి నిజామాబాద్ నగరానికి భారీ ర్యాలీ నిర్వహించారు.

అనంతరం నగరంలోని శ్రీరామ గార్డెన్ లో ఏర్పాట్లు చేసిన పార్టీ ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు.రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ పార్టీ అమలుకు నోచని హామీలను ఇచ్చిందని అన్నారు. అలాగే బీజేపీపై అవి చేస్తున్న ఆరోపణలు అబద్ధాలకు పరాకాష్ట అన్నారు. అలాగే రాష్ట్రంలో అబద్ధపు హామీలతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చారని.

రైతులను కూడా మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు.ఇక రాష్ట్రంలో యూరియా కొరత కత్రిమమేనని అది కాంగ్రెస్ పార్టీ సృష్టించిందని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీకి రైతుల గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ లు ఒక్కటేనని అందుకే ఫోన్ ట్యాపింగ్ కేసును, ఓటుకు నోటు కేసును పరస్పరం సహకరించుకుంటున్నాయని వాటికి చిత్తశుద్ది ఉంటే ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకీ అప్పగించాలని డిమాండ్ చేశారు.

రాష్ట్రంలో కేంద్రం ప్రభుత్యం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి ప్రజల్లోకి తీసుకెళ్లాలని తెలిపారు.రాష్ట్రంలో కాంగ్రెస్ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో ఎన్నికలు నిర్వహించడం లేదని ఆరోపించారు.రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ జెండా ఎగరడం ఖాయమన్నారు.

బిజెపి కార్యకర్తలు మార్పు కోసం పని చేయమని,తెలంగాణలో బీజేపీ గెలిస్తే కేంద్రం వున్నంట ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్,అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా,జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి,పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, ఎమ్మెల్సీలు మల్క కొమురయ్య, అంజిరెడ్డి, జగిత్యాల జిల్లా అధ్యక్షుడు యాదగిరి బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!