బీసీ రిజర్వేషన్ ల విషయంలో నెలకొన్న సందిగ్ధం తొలిగి పోవడంతో స్థానిక సంస్థల కు ఎన్నికలు నిర్వహించే విషయంలో ప్రభుత్వం పట్టుదలతో వుండడం తో ఎన్నికల కమిషన్ దూకుడు పెంచింది.
యంపిటిసి జెడ్పిటిసి ఎన్నికల కసరత్తులు సైతం తెరలేపింది. ఈపాటికే గ్రామ పంచాయతీ ఎన్నికల పక్రియ ను మొదలు పెట్టిన కమిషన్ తాజాగా సెప్టెంబరు 10వ తేదీ నాటికి ఎంపీటీసీ, జడ్పీటీసీ ఓటర్ల, పోలింగ్ కేంద్రాల తుది జాబితా ప్రచురించాలని ఆదేశిస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ కలెక్టర్లకు ఉత్తర్వులు జారీ చేసారు.
సెప్టెంబరు 6న ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాల వారీగా ఓటర్ల, పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితాలు ప్రచురించాలని పేర్కొంది. సెప్టెంబర్ 6 నుంచి 8 వరకు అభ్యంతరాలు, వినతుల స్వీకరించి
8న జిల్లా స్థాయిలో కలెక్టర్లు, మండల స్థాయిలో ఎంపీడీవోలు అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించాలి వారి నుంచి పిర్యాదు లు తీసుకోవాలి 9న అభ్యంతరాలు, వినతులు పరిష్కరించాలి
10న తుది ఓటర్ల జాబితా , తుది పోలింగ్ కేంద్రాల వివరాలు ముద్రించాలని కమిషన్ పేర్కొంది
