డ్రంకన్ డ్రైవ్లో పట్టుబడిన ఐదుగురికి జైలు శిక్షా, 31 మందికి జరిమానా విధించినట్లు ట్రాఫిక్ సిఐ ప్రసాద్ తెలిపారు.
మద్యం తాగి వాహనాలు నడిపినటువంటి 36 మందికి ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ ఆదేశానుసారం ఇన్స్పెక్టర్ పి.ప్రసాద్ సోమవారం కౌన్సిలింగ్ నిర్వహించిన అనంతరం సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ నూర్ జాన్ ముందు హాజరుపరచగా 32 మందికి 47,000 /– జరిమానా విధించగా సిద్దుల శ్రీకాంత్ కు రెండు రోజులు జైలు శిక్ష, ఎం సాయిబాబా, షేక్ గౌస్ లకు మూడు రోజుల శిక్ష, షేక్ అమర్ కు నాలుగు రోజులు శిక్ష, షేక్ పురోజ్ కు వారం రోజుల జైలు శిక్ష విధించినట్లు తెలిపారు.
వాహనదారులు తాగినడపకూడదని ట్రాఫిక్ ఏసిపి మస్తాన్ అలీ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ప్రసాద్ హెచ్చరించినారు.
