..
గణేష్ నిమజ్జనం ఫై నెలకొన్న సందిగ్ధం కు తెరపడింది. సెప్టెంబర్ 6న శనివారమే గణేష్ నిమజ్జనోత్సవాలు నిర్వహించనున్నారు.
ఈ మేరకు సార్వజనిక గణేష్ మండలి ముహూర్తం ఖరారు చేసింది. ఇందుకు అనుగుణంగా యంత్రాంగం విస్తృతమైన ఏర్పాట్లు చేస్తుంది. అదే రోజు మధ్యాహ్నం శోభాయాత్ర దుబ్బ నుంచి మొదలు కాబోతుంది.
రత యాత్ర కు పోలీస్ శాఖ భారీ బందోబస్త్ ఏర్పాటు చేస్తుంది. గణేష్ బందోబస్తు ఏర్పాట్లను సీపీ సాయి చైతన్య స్వయంగా చూస్తున్నారు. ఈపాటికే ఆయన స్వయంగా బైండోవర్ పక్రియ చేపట్టారు అలాగే విగ్రహాల ఎత్తును బట్టి ఎక్కడెక్కడ నిమజ్జనం చేయాలో పోలీసులు ఆయా మండలి ల నిర్వాహుకులకు దిశానిర్దేశం చేసారు.
గణేష్ విగ్రహాలను నిమజ్జనం చేసే వినాయక్ బావి బాసర ఉమ్మెడ గోదావరి నది లను కమిషనర్ పరిశీలించారు నిజామాబాద్ నగరంలో గణేష్ నిమజ్జన శోభాయాత్ర సంధర్బంగా 8 ఫీట్ల కన్న ఎక్కువ ఎత్తు గల విగ్రహాల యొక్క రూట్ మార్చారు .
జాన్కంపేటు నందు బ్రాడ్ గేజ్ రైలు హై టెన్షన్ రైల్వే లైన్ గలదు , కావున ఆ రూటు నందు 8 ఫీటుల కంటె ఎక్కువ ఎత్తు గల వాహనాలు వెళ్ళడం నిషేదించడం జరిగిందన్నారు.
అందుకేగణేష్ విగ్రహం 8 ఫీట్ల కంటె ఎత్తుగల విగ్రహాలను నిజామాబాద్ నగరంలోని గాజుల పేట శివాజీ నగర్, గోల్ హన్మాన్ , అంగడి బజార్, ఎల్లమ్మ గుట్ట , పూలాంగ్ , రాజారాజేంద్ర చౌరస్తా చూట్టు ప్రాంతాలు , సాయినగర్ , గాయిత్రి నగర్ , కోటగల్లి, హౌసింగ్ బోర్డు , బోర్గామ్ , న్యాల్కల్ , నాగారాం మొదలగు కాలనీల వారు పూలాంగ్ – ఎన్.టి.ఆర్ చౌరస్తా – రైల్వే స్టేషన్ – బస్ స్టేషన్ – రైల్వే ఓవర్ బ్రిడ్జి – శివాజీ చౌక్ – దుబ్బా – జి.జి కాలేజీ చౌరస్తా – బైపాస్ రోడ్డు – DS చౌరస్తా – ముబారక్ నగర్ – మాణిక్ బండార్ – దాస్ నగర్ – మాక్లూర్ – నందిపేట్ ( ఉమ్మెడ గ్రామ సరిహద్దులో గల గోదావరి బ్రిడ్జికి వెల్లవచ్చు ) లేదా – నవిపేట్ – బాసర గోదావరి బ్రిడ్జికి వెళ్ళ వచ్చునని పోలీసులు సూచించారు.
అలాగే 8 ఫీట్ లోపు గల విగ్రహాలను పాత రూటు ప్రకారంగా అనగా నెహ్రూపార్కు , అర్సాపల్లి , జాన్కంపేట్ , నవిపేట్ మీదుగా బాసర కు వెళ్ల వెళ్ళాలని పోలీసులు చెప్తున్నారు .శోభాయాత్ర , నిమజ్జనం ఆలస్యం లేకుండా , ప్రశాంతంగా విజయవంతంగా , ఆహ్లాద కరమైన భక్తి వాతావరణంలో జరుపుకోవాలని సీపీ కోరారు
