పోలీస్ కమిషనర్ సాయి చైతన్య వెల్లడి..సెప్టెంబర్ 6 వ తేదీన నగరంలో నిర్వహించే గణేష్ నిమజ్జనోత్సవాలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య వెల్లడించారు.
ఈ మేరకు ఆదివారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.వచ్చే వారం సెప్టెంబర్ 06వ తేదీన నిజామాబాద్ నగరంలో గణేష్ నిమజ్జన శోభాయాత్ర సంధర్బంగా 8 ఫీట్ల కన్న ఎక్కువ ఎత్తు గల విగ్రహాల యొక్క రూట్ మార్చినట్లు తెలిపారు.
జాన్కంపేటు నందు బ్రాడ్ గేజ్ రైలు హై టెన్షన్ రైల్వే లైన్ గలదు , కావున ఆ రూటు నందు 8 ఫీటుల కంటె ఎక్కువ ఎత్తు గల వాహనాలు వెళ్ళడం నిషేదించడం జరిగిందన్నారు.
అందుకేగణేష్ విగ్రహం 8 ఫీట్ల కంటె ఎత్తుగల విగ్రహాలను నిజామాబాద్ ప్రాంతం వారు గాజుల పేట శివాజీ నగర్, గోల్ హన్మాన్ , అంగడి బజార్, ఎల్లమ్మ గుట్ట , పూలాంగ్ , రాజారాజేంద్ర చౌరస్తా చూట్టు ప్రాంతాలు , సాయినగర్ , గాయిత్రి నగర్ , కోటగల్లి, హౌసింగ్ బోర్డు , బోర్గామ్ , న్యాల్కల్ , నాగారాం మొదలగు కాలనీల వారు పూలాంగ్ – ఎన్.టి.ఆర్ చౌరస్తా – రైల్వే స్టేషన్ – బస్ స్టేషన్ – రైల్వే ఓవర్ బ్రిడ్జి – శివాజీ చౌక్ – దుబ్బా – జి.జి కాలేజీ చౌరస్తా – బైపాస్ రోడ్డు – DS చౌరస్తా – ముబారక్ నగర్ – మాణిక్ బండార్ – దాస్ నగర్ – మాక్లూర్ – నందిపేట్ ( ఉమ్మెడ గ్రామ సరిహద్దులో గల గోదావరి బ్రిడ్జికి వెల్లవచ్చు ) లేదా – నవిపేట్ – బాసర గోదావరి బ్రిడ్జికి వెళ్ళ వచ్చునని సూచించారు.
అలాగే 8 ఫీట్ లోపు గల విగ్రహాలను పాత రూటు ప్రకారంగా అనగా నెహ్రూపార్కు , అర్సాపల్లి , జాన్కంపేట్ , నవిపేట్ మీదుగా బాసర కు వెళ్ల వెళ్ళాలని తెలిపారు.శోభాయాత్ర , నిమజ్జనం ఆలస్యం లేకుండా , ప్రశాంతంగా విజయవంతంగా , ఆహ్లాద కరమైన భక్తి వాతావరణంలో జరుపుకోవాలని అన్నారు.
అలాగే జిల్లాల్లోని అన్ని గణేష్ మండలి నిర్వహకులు , భక్తులు , ప్రజలు అనునిత్యం సంబంధిత పోలీస్ వారికి సహకరించాలని తెలిపారు.
