ఫిట్స్ వచ్చి రోడ్డుపై పడిపోయిన వ్యక్తిని కాపాడి ట్రాఫిక్ పోలీసులు మానవత్వాన్ని చేరుకున్నారు.
ఆదివారం కంటేశ్వర్ టీ జంక్షన్ నందు ఓ గుర్తు తెలియని వ్యక్తి ఫీడ్స్ వచ్చి రోడ్డుపై పడిపోగా వెంటనే అక్కడ డ్యూటీలు విధులు నిర్వహిస్తున్నటువంటి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ప్రసాద్, హెడ్ కానిస్టేబుల్ కోటేశ్వరరావు, కానిస్టేబుల్ శేఖర్ బాబు, దినేష్, ఉమెన్ కానిస్టేబుల్ స్వప్న లు వెంటనే స్పందించి అట్టి వ్యక్తి కి సపర్యాలు చేసి హుటాహుటిన 108 అంబులెన్స్ ని పిలిపించి చికిత్స నిమిత్తం ప్రభుత్వ హాస్పిటల్ కి పంపించినట్లు సీఐ ప్రసాద్ తెలిపారు.
ఫిట్స్ వచ్చి రోడ్డుపైన పడిపోయిన వ్యక్తిని సకాలంలో కాపాడిన ట్రాఫిక్ పోలీసులను ఏసిపి మస్తాన్ అలీ, నగర ప్రజలు అభినందించారు.
