ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ 66 వ సంవత్సరం ఆవిర్భావం సందర్భంగా నిర్వహించిన ” స్వచ్ఛంద రక్తదాన శిబిర ” కార్యక్రమాన్ని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ప్రారంభించారు.
నిజామాబాద్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పోలీస్ ఫిల్లింగ్ స్టేషన్ లో సోమవారం స్వచ్ఛంద రక్తదాన శిబిరం కార్యక్రమము ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వారి సారథ్యంలో నిర్వహించగా ముఖ్య అతిథులుగా పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య ప్రారంభించారు.
ముందుగా ఈ రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన అనంతరం రక్తదాన శిబిరంలో పాల్గొన్న వారిని ఉద్దేశించి మాట్లాడుతూ.. ఈ రక్తదాన శిబిరంలో పాల్గొనడం నాకు ఎంతో గర్వకారణంగా ఉందనీ అన్నారు.
అలాగే ఒక్కొక్కరు ముందుకు వచ్చి రక్తం దానం చేస్తే, ఎన్నో ప్రాణాలు కాపాడగలమనీ అన్నారు. ఇది ఒక మనిషి జీవితం కోసం మనం చేయగల గొప్ప సేవ.ప్రతీ ఒక్కరినీ ఈ మహత్తర కార్యంలో భాగస్వాములవ్వాలని కోరారు.
మన రక్తం ఎవరికో ఒకరి ప్రాణాన్ని నిలబెట్టగలదు అందుకే, ఎప్పుడైనా అవకాశం ఉన్నప్పుడల్లా రక్తదానం చేయాలని కోరారు.పోలీస్ శాఖ తరఫున, సామాజిక బాధ్యతగా ఇటువంటి సేవా కార్యక్రమాల్లో ముందుంటామని మీకు హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమం యందు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ పూర్ణచంద్రరావు, పోలీస్ వెల్ఫేర్ ఇన్స్పెక్టర్ తిరుపతి , రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ ఆంజనేయులు,ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అధికారులు మోహన్ కిషోర్, అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
