పార్టీలో ఫై ధిక్కార స్వరం ఎత్తిన ఎమ్మెల్సీ కవిత ఎట్టకేలకు సస్పెండ్ అయ్యారు. తదుపరి ఆమె రాజకీయ అడుగుల ఫై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
ఆమె సొంత పార్టీ తోనే రాజకీయ ప్రస్థానం సాగించబోతున్నారని ప్రచారం జరుగుతుంది. మెట్టినిల్లు నిజామాబాద్ జిల్లాతో ఆమె కు ఉద్యమ కాలం నుంచే బలమైన బంధం ఉంది.సొంత కుంపటి పెడితె ఆమె వెంట వెళ్తారనేది పార్టీవర్గాలకు ఆసక్తి గా మారింది.
అయిదేళ్ళు ఎంపీ గా ఎమ్మెల్సీ గా దాదాపు పదేళ్లుగా జిల్లా పార్టీ ని తన కనుసైగలతో శాసించారు.ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే లకు ప్రత్యామ్నాయనాయకత్వం ను పెంచి పోషించారు. ఇప్పుడు ఆ నేతలు కవిత వెంట వెళ్తారా ? లేదంటే బిఆర్ యస్ లోనే కొనసాగుతారా అనేది చూడాలి. ఆమె సస్పెండ్ నేపథ్యంలో జిల్లాలో ఆ పార్టీ మీద ఎలాంటి ప్రభావం చూపుతుందనేది సర్వత్రా ఆసక్తిగా మారింది.నిజామాబాద్ లోకసభ నియోజకవర్గం లో ఆమె బిఆర్ యస్ పార్టీలో బలమైన ప్రాబల్యం ఉంది.
ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే ల్లో గుబులు మొదలయ్యింది. అసలే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత నియోజకవర్గాలకు దూరంగా ఉండి పోయిన తమకు కవిత రూపం లో ఎలాంటి విపత్తు తలెత్తుతుందో ననే బెంగ వారిలో ఉంది.
బిఆర్ యస్ నేతలనే కవిత తన వెంట తీసుకెళ్లే ఛాన్స్ ఉంది లోకల్ బాడీ ఎన్నికల నేపథ్యంలో ఈ పరిణామాలు పార్టీ కి తీవ్ర నష్టం కలిగిస్తాయనే ఆందోళన ఆ నేతల్లో వ్యక్తం అవుతుంది.అందుకే తమ నియోజకవర్గంలో ఆమె వెంట ఎవరెవరు వెళ్తారనేది అరా తీస్తున్నారు.
క్రియా శీలకంగా ఉన్న వారెవ్వరూ ఆమె వెంట వెళ్లకుండా కట్టడి చేసే పనిలో మాజీ లున్నారు . నిజానికిలోకసభ ఎన్నికల్లో ఓటమి తర్వాత జిల్లా పార్టీలో ఆమె ప్రాబల్యం నామ మాత్రంగా మారింది. జిల్లాకు చెందిన ముఖ్య నేతలెవ్వరూ ఆమె కు టచ్ లో వుండడం లేదు.
అసలు కొఠారి ధాటి ఆమెను కలవడం గతంలో ఎమ్మెల్యే లకు కష్టంగా ఉండే. ఇక సాధారణ నేతలకు కలిసి అవకాశం వుండేది కాదు . అందుకే ఎన్నికల్లో ఓడి పోయారు. ఆ తర్వాత కూడా పార్టీలో ప్రతికూల పరిస్థితులను ఎదుర్కున్నారు.
ఆమె కు అండగా నిలవడానికి బలమైన నేతలెవ్వరూ ఇప్పడు ముందుకొచ్చే సిన్ లేకుండా పోయింది. ఆమె చుట్టూ ఉండే కోటరీ లతో గతంలో ఎమ్మెల్యే లే వేగ లేక పోయే వారు .
అందుకే పార్టీ అధికారంలో ఉన్నకాలం లోనే తమ నియోజకవర్గాల్లో కవిత ప్రాబల్యం లేకుండా ఎమ్మెల్యే లు కట్టడి చేసారు. ఆమె వెంట తిరిగే వారిని వ్యూహాత్మకంగా టార్గెట్ చేస్తూ వచ్చారు.
ఆమె కు తెలిసినా నిస్సహాయత గా ఉండి పోయారు.ఓ దశలో ఆమె తెలంగాణ భవన్ లో జరిగిన సమీక్ష సమావేశంలోనే మాజీ ల మీద నిప్పులు చెరిగారు.
ఆమె రాబోయోరోజుల్లో జిల్లాలో మునుపటి ప్రాబల్యం ఉండక పోవచ్చనే చర్చ సాగుతుంది. గతంలో ఎంపీ గా ప్రాతినిధ్యం వహించిన అయిదేళ్ల కాలంలోనే జిల్లా పార్టీలో పాలనా వ్యవహారాల్లో అత్యంత క్రియాశీలకంగా వ్యవహరించారు.
అదే టైమ్ లో ఎమ్మెల్యే లతో దూరంగా పెరిగి ఆమె ఓటిమికి దారితీసింది. ఈ అనుభవాల నేపథ్యంలో నే ఎమ్మెల్సీ గా నియామకం అయ్యాక జిల్లా పార్టీ వ్యవహారాల్లో జోక్యం చేసుకోలేదు.ఇంకా చెప్పాలంటే దూరంగానే వుంటూ వస్తున్నారు. అడపా దడపా వచ్చి వెళ్తున్నారు.
కానీ జిల్లా వ్యాప్తంగా ప్రజాక్షేత్రంలో ఆమె చార్మింగ్ ఉన్న నేతగా ముద్ర వేసుకున్నారు. యువ క్యాడర్ లో ఆమెకు బలమైన ఫాలోయింగ్ ఉండే .
మరో వైపు జాగృ తి వేదికలో తటస్తులే ఎక్కువగా ఉన్నారు.వీరంతా రాబోయే రోజుల్లో కవిత వెంట మరింత క్రియాశీలకంగా పనిచేసే ఛాన్స్ ఉంది.
