మూడున్నరేళ్ల చిన్నారిపై లైంగిక వేధింపులకు పాల్పడిన కరాటే కోచ్ కు రాజేంద్రనగర్ స్పెషల్ పోక్సో కోర్టు 20 ఏళ్లు జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చారు . మియాపూర్ పీఎస్ పరిధిలో జరిగిన ఈ ఘోర ఘటన అప్పట్లో సంచలనం రేపింది. 2
019 జూన్ 12 బాలిక పేరెంట్స్.. స్థానిక ప్లే స్కూల్లో చేర్పించారు. స్కూల్లో చేరిన మర్నాటి నుంచే కరాటే కోచ్ గా పనిచేస్తున్న కిరణా సాయి (24) అనే యువకుడు లైంగికంగా వేధించడం మొదలుపెట్టాడు. దీంతో భయపడిన పాప.. రోజూ స్కూలుకు వెళ్లనంటూ మారాం చేసేది.
ఎంత ఏడ్చినా.. పిల్లలు ఇలానే చేస్తారనుకున్న తల్లిదండ్రులు ఆమెను సముదాయించి పంపేవారు. కొద్దిరోజుల తర్వాత.. ఆ చిన్నారి ఈ విషయాన్ని అమ్మమ్మకు చెప్పడంతో.. ఈ దారుణం వెలుగుచూసింది.
