సుదీర్ఘ పోరాటానికి చెక్ పెట్టింది. విదేశీ మారక నియంత్రణ చట్టంఫెమా ఉల్లంఘనల ఆరోపణల ఫై అపోలో హాస్పిటల్స్ భారీగా పెనాల్టీ చెల్లించి ఈ కేసును రాజీ చేసుకుంది. ఇందులో భాగంగా అపోలో సంస్థ, అలాగే ఆ సంస్థకు చెందిన ఐదుగురు కీలక డైరెక్టర్లకు కలిపి మొత్తం రూ.17.76 కోట్లకు పైగా జరిమానాగా విధించారు.
ఈ ఒప్పందంలో భాగంగా అపోలో హాస్పిటల్స్ సంస్థ 17.76 కోట్ల జరిమానా చెల్లించి, కేసు నుంచి విముక్తి పొందనుంది. సంస్థతో పాటు విడిగా బాధ్యులైన ఐదుగురు టాప్ డైరెక్టర్లు మరియు అధికారులు ప్రీతా రెడ్డి, సునీతా రెడ్డి, ఎస్.కె. వెంకటరామన్, అఖిలేశ్వరన్ కృష్ణన్, ఎస్.ఎం. కృష్ణన్ వ్యక్తిగతంగా ఒక్కొక్కరు రూ.18 లక్షల చొప్పున జరిమానా మొత్తాన్ని జరిమానా రూపం లో చెల్లించనున్నారు.
అపోలో హాస్పిటల్స్ యాజమాన్యం విదేశీ పెట్టుబడుల తీసుకోవడం , షేర్‌హోల్డింగ్, మల్టీ-బ్రాండ్ రిటైల్ రంగానికి సంబంధించిన నిబంధనలను అతిక్రమించిందనే ఆరోపణలు వచ్చాయి.
ఈ నిబంధనల ఉల్లంఘనల విలువ మొత్తం సుమారు రూ.2,424 కోట్లుగా అంచనా వేశారు. సాధారణంగా ఇటువంటి కేసుల్లో సుదీర్ఘ కాలం పాటు కోర్టుల చుట్టూ తిరగకుండా, తప్పులను అంగీకరిస్తూ ఆర్బీఐ నిబంధనల ప్రకారం కాంపౌండింగ్ ఫీజు చెల్లించి కేసులను ముగించుకునే సదుపాయంను . అపోలో సంస్థ వినియోగించుకుంది
