సంకష్ట హర చతుర్థి కావడంతో శ్రీ శుభం కరోతి గణపతి దేవాలయంలో ప్రత్యేక పూజలు సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు కిషోర్ శర్మ మాట్లాడుతూ ఈరోజు సంకష్టహర చతుర్థి కావడంతో ఉదయం
ఏడు గంటలకు పంచామృతాలతో అభిషేకం నిర్వహించామని తెలిపారు 7:30 కు హారతి , ఈరోజు స్వామివారికి పూలు పండ్లతో అలంకరణ జరిపించామన్నారు 8:30 గంటలకి గణపతి హోమం కార్యక్రమం ఉంటుందన్నారు
ఒక్కపొద్దులు ఉన్నవారు ఈరోజు సాయంత్రం ఎనిమిది గంటల 14 నిమిషాల తర్వాత విడువ వచ్చని తెలిపారుసాయంత్రం 8:30 గంటలకు అన్న ప్రసాద కార్యక్రమం ఉంటుందని ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అన్న ప్రసాదం స్వీకరించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు శివకుమార్ శర్మ ,దీపక్ శర్మ, సాగరప్ప మరియు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు
