HomeTelanganaNizamabadఅన్నదాత గుండెకోత..వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవాలి.బోధన్ సీనియర్ నాయకులు మోహన్ రెడ్డి డిమాండ్..

అన్నదాత గుండెకోత..వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవాలి.బోధన్ సీనియర్ నాయకులు మోహన్ రెడ్డి డిమాండ్..

ప్రకృతి వైపరీత్యాల కారణంగా సంభవించే భారీ వరదలు, వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని బోధన్ సీనియర్ నాయకులు మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు.

ఈ మేరకు సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో ఇటీవల బోధన్ మండలంలో వరదలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని జిల్లా కలెక్టర్ కు అర్జీ అందించారు.

అనంతరం ఆయన మీడియా తో మాట్లాడుతూ..జిల్లాలోని తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఒక్కరుకూడా బోధన్, హుంసా,హంగర్గ లాంటి గ్రామాల గురించి చర్చిస్తారని చూసాము,కానీ ఒక్క నాయకుడు కూడా గొంతెత్తలేదనీ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ వరదల కారణంగా, వేలాది ఎకరాల సోయా, వరి, పత్తి, పంట 90% శాతం పెట్టుబడి పెట్టిన తర్వాత పూర్తిస్థాయిలో పంట నష్టం జరిగిందన్నారు.

అదేవిధంగా వరద నీరు ఇళ్లల్లోకి వచ్చి తినడానికి తిండి లేకుండా నిత్యవసరం వస్తువులను కూడా కోల్పోయి కుటుంబాలు రోడ్డున పడ్డాయని అన్నారు.

రైతులు పండించిన పంటను పూర్తిగా కోల్పోయి తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు. ఇప్పటివరకు ప్రభుత్వం నుండి ఎలాంటి ఆర్థిక సహాయము అందలేదనీ కనీసం ఒక్క ఎమ్మెల్యే కూడా రైతుల వైపు కన్నెత్తి చూడలేరని ఆవేదన వ్యక్తంచేశారు.

ఎలాంటి పరిమితులు లేకుండా రైతులు ఎన్ని ఎకరాలు అయితే నష్టపోయారో అన్ని ఎకరాలకు పంట పూర్తి నష్టపరిహారాన్ని అందచేయవలసిందిగా కోరారు. అదే విధంగా ప్రస్తుతం కోలుకోవాలంటే ప్రభుత్వం యొక్క ఆర్థిక సహయం చాలా అవసరం.

కాబట్టి నష్టపోయిన రైతులకు తక్షణమే ఆర్థిక సహాయం అందజేయడం ద్వారా కనీసం రబీ పంట వేసుకోవడానికి సహాయం చేసినట్టుఅవుతుంది.

ఒక వేళ పూర్తి నష్ట పరిహారాన్ని చెల్లించని యెడల మేము రైతులమందరం పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టడానికి వెనుకాడమని హెచ్చరించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments