రైలుకు ఎదురుగా వెళ్ళి యువకుడు ఆత్మహత్యాయత్ననికి పాల్పడ్డాడు. ఈ ఘటన నగరంలోని రైల్వే స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
సాలూరు మండలం ఖాజాపూర్ కి చెందిన పవన్(28) బీటెక్ పూర్తి అయ్యి కలిగ ఉంటున్నట్లు తెలిపారు.బీటెక్ పూర్తి అయ్యిన నటి నుంచి కాలిగా ఉంటున్నాడు.
ఈ మేరకు గత కొన్ని రోజుల నుంచి నిజామాబాద్ కేంద్రంలోనే ఉంటున్నట్లు తెలిపారు.
ఈ మేరకు బెట్టింగ్,తాగుడుకు బానిస అవ్వడంతో అప్పులు ఎక్కువ అయినట్లు తెలిపారు.అప్పుల బాధలతో తరచు తల్లిదండ్రులకు ఫోన్ చేసి నా అప్పులు తీర్చాలంటూ ఒత్తిడి చేసేవాడని పేర్కొన్నారు.
దీంతో అప్పులు తీర్చలేక రైలు కి ఎదురెళ్లి ఆత్మ హత్యాయత్నానికి పాల్పడినట్లు తెలిపారు. రైలు ఢీ కొనడంతో తీవ్ర గాయాలయ్యాయి.
రైల్వే ట్రాక్ వద్ద పండి ఉండటం చూసి స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటన స్థలానికి చేరుకొని హుటహుటిన జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.
