HomeCRIMEవిదేశాలలో ఉద్యోగాల పేరుతొ సైబర్ నేరాలు వ్యక్తి పై పి.డి యాక్ట్ నమోదు………చెంచల్ గూడా జైలుకు...

విదేశాలలో ఉద్యోగాల పేరుతొ సైబర్ నేరాలు వ్యక్తి పై పి.డి యాక్ట్ నమోదు………చెంచల్ గూడా జైలుకు తరలింపు..రాష్ట్రంలో మొట్టమొదటిసారి సైబర్ నేరాల మీద పి.డి యాక్ట్ కేసు నమోదు..సైబర్ నేరగాళ్లను ఉపేక్షించేదిలేదు పోలీస్ కమిషనర్ వెల్లడి

సైబర్ నేరాలకు పాల్పడుతున్న ఓ వ్యక్తి మీద నిజామాబాద్ పోలీసులు పిడి యాక్టు కేసు నమోదు చేసారు. నిందితుడి ని చంచల్ గూడ జైలు కు తరలించారు సైబర్ నేరాల కేసులో రాష్ట్రం లోనే మొదటి సారిగా నిజామాబాద్ పోలీసులు పిడి అస్రం సంధించారు.

నిజామాబాద్ పోలీస్ కమిషనరేటు పరిధిలోని కొంత మంది నిరుద్యోగ యువతకు కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలు ఇప్పిస్తాము అని నమ్మబలికి లావోస్, థాయిలాండ్ దేశాలకు పంపించి వారితో అక్కడనుంచి సైబర్ నేరాలు చేయిస్తున్న ఓ ఘరానా కేటుగాడిని నిజామాబాద్ పోలీసులు అరెస్టు చేశారు.


హైదరాబాద్ సుచిత్ర లో ఉండే నాగ శివ యువతకు మంచి ఉద్యోగాలు, అధిక వేతనాలు ఇస్తామని చెప్పి, వారిని లావోస్, థాయిలాండ్ దేశాలకు పంపించేవాడు. అక్కడకు వెళ్లిన తర్వాత వారి పాస్ పోర్ట్ లు స్వాధీనం చేసుకుని చట్ట విరుద్దమైన సైబర్ మోసాలకు బలవంతంగా చేయిస్తున్నాడు, ఇతనిపై పలువురు బాధితులు ఆయా ప్రాంతాల్లో ఫిర్యాదులు ఇవ్వగా ఆయా పోలీసు స్టేషన్ లలో కేసులు నమోదు చేసారు .నిజమాబాద్ సీసీఎస్ లో రెండు ఆర్మూర్ సిరిసిల్ల లో రెండు కేసులు నమోదు అయ్యాయి

ఈ గ్యాంగ్ అంతర్జాతీయ స్థాయిలో కార్యకలాపాలు నిర్వహిస్తోందని, ఇందుకు గాను ప్రధాన సూత్ర దారు డైన కోలనాటి నాగశివ ను గుర్తించిన పోలీసులు అతని మీద పి.డి యాక్ట్ 1986 తెలంగాణ (ప్రివెన్షన్ డిటెన్షన్) ను ప్రయోగించి ఇతనిని చెంచల్ గూడా జైలుకు పంపారు . అధిక జీతాలు ఆశ చూపి విదేశాల పంపి మోసాలకు పాల్పడే వారి విషయంలో కఠిన చర్యలు తప్పవని సీపీ సాయి చైతన్య హెచ్చరించారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments