కలెక్టర్ ……కమిషనర్ లుండే జిల్లా కేంద్రం అక్రమ దందా లకు అడ్డాగా మారింది. అక్రమ దందా లకు అలవాటు పడిన కొందరు అధికార పార్టీనేతలు ఇప్పడు మొరం దందా ను చెరబట్టారు.
ప్రభుత్వ ఖజానా కు చిల్లి గవ్వ ఇవ్వకుండా కోట్ల రూపాయల విలువైన మొరం ను దర్జాగా తవ్వేసి అమ్మేస్తున్నారు. నిజామాబాద్ నగరంలోని నాగారం లో గోశాలకు చెందిన భూముల్లో గత పదిహేను రోజుల్లో మొరం అక్రమ తవ్వకాలు సాగుతుంది.
అసలు ఆ ప్రాంతంలో మొరం తవ్వకాలకు తాము ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని రెవెన్యూ మైనింగ్ అధికారులు పదవి విరిస్తున్నారు. నిజానికి నగరంలో గోశాల కమిటీ కి విలువైన భూములు ఉన్నాయి.
వీటి జోలికి ఎవ్వరు వెళ్లారు. ఆవే గోషాల్ కు చెందిన భూములమీద కన్నేసిన అధికార పార్టీ నేతలు గోషాల్ నిర్వహణలో కీలక వ్యక్తి కి భారీ మొత్తం లో నగదు ఎర వేసి అక్రమ మొరం తవ్వకాలకు కార్యాచరణ సిద్ధం చేసారు.
నిజానికి గోషాల్ లోపల వెళ్ళడానికి ఎవ్వరికిఅనుమతి వుండదు.అదే అదనుగా చేసుకొని అధికార పార్టీ నేతలు రాత్రి పగలు తేడా లేకుండా మొరం తవ్వకాలకు తెరలేపారు. ప్రతి రోజు 40నుంచి 50 టిప్పర్ల తో మొరం ను నగరంలోని ఆయా ప్రాంతాలకు యథేచ్ఛగా తరలిస్తున్నారు.
ఒక్కో మొరం టిప్పర్ ను నాలుగు వేల నుంచి అయిదు వేల రూపాయలకు విక్రయిస్తున్నారు.
అయితే తమ భూముల్లో మొరం తవ్వకాలు చేస్తుందుకు ప్రతిఫలంగా ఒక్కో టిప్పర్ కు వెయ్యి రూపాయలు గోషాల్ కమిటీ నిర్వాహుకులు వసూలు చేస్తున్నారు రోజు ఎన్ని టిప్పర్లు వెళ్తున్నాయనేది రికార్డ్ నమోదు చెయ్యడానికి ఓ ఉద్యోగి ని సైతం రంగంలోకి దించారు
అయితే గోషాల్ భూముల్లో మొరం తవ్వకాలు జరుగుతున్నవిషమే తమకు తెలియదని సౌత్ తహశీల్ధార్ ఇది సంగతి కి చెప్పారు.
ఏ భూముల్లో మొరం తవ్వకాలు చేసిన అనుమతులు తీసుకోవాలని మైనింగ్ అధికారి తెలిపారు.
