HomeCRIMEనగరంలో తాళం వేసిన ఇంట్లో భారీ చోరి..

నగరంలో తాళం వేసిన ఇంట్లో భారీ చోరి..

నిజామాబాద్ నగరంలో తాళం వేసిన ఇంట్లో భారీ చోరి జరిగింది. ఈ సంఘటన ఐదవ టౌన్ పరిధిలో చోటుచేసుకుంది. బాధితుల వివరాల ప్రకారం..

నగరంలోని బాబన్ సహాడ్ పహాడ్ కు చెందిన నిషత్ ఆఫ్రిన్ బుధవారం ఫంక్షన్ నిమిత్తం ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో కలిసి అర్సపల్లి లోని బంధువుల ఇంటికి వెళ్లినట్లు తెలిపారు.అనంతరం గురువారం ఉదయం వచ్చి చూడగా ఇంటి తాళం గుర్తు తెలియని దుండగులు తాళం పగలగొట్టి ఇంట్లోకి చొరబడి చోరి చేసినట్లు తెలిపారు.

ఇంట్లో నుంచి సౌదీ కి చెందిన 50 వేల రియల్లు, అనగా ఇండియాకు చెందిన 15 లక్షల రూపాయలు, 20 తులాల బంగారం అపహరించినట్లు తెలిపారు.

దీంతో స్థానిక ఐదవ టౌన్ పోలీసులకు సమాచారం అందించారు.ఎస్ఐ గంగాధర్ ఘటన స్థానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నట్లు ఎస్ఐ గంగాధర్ తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments