జిల్లాలో ఆయా ప్రాంతాల్లో తరుచు అడ్డాలు మార్చేస్తూ కార్పొరేట్ స్థాయిలో జూదం ఆడిపిస్తున్న ఓ ముఠా ను పోలీసులు అదుపులోకి తీసుకోని విచారిస్తున్నారు.
ఓ హోటల్ ను అడ్డా చేసుకొని బోధన్ ఆర్మూర్ ప్రాంతాల్లో భారీఎత్తున జూదం నిర్వహిస్తున్నారు ఎప్పటికప్పుడు అడ్డాలు మార్చేస్తున్నారు అయినా స్థానిక పోలీసులను మేనేజ్ చేసుకుంటూ ఈ దందా సాగిస్తున్నారు.
అయితే జిల్లా కేంద్రం నుంచి పోలీసులు దాడులు చేసినా వారికి ఎలాంటి నగదు దొరక కుండా కార్పొరేట్ తరహా లో కాయిన్ లను అందుబాటులోకి తెచ్చారు.
నగదు ఇచ్చి జిల్లా కేంద్రంలోనే ఓ హోటల్ లో కాయిన్ తీసుకోవాలి జూదం అడ్డా ఎక్కడ నిర్వహిస్తారనేది ఒక్క రోజు ముందు వాట్సప్ లో సమాచారం ఇస్తారు.
అయితే జూదం అడ్డాలను శివారు ప్రాంతాల్లో ప్రైవేట్ వ్యక్తుల పహారా ల మధ్య ఈ దందా సాగితున్నారనేది పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడింది.
ఈ ముఠా లో కీలక వ్యక్తుల ఇంకా పోలీసు లకు ఇంకా చిక్క లేదు వీరిని నుంచి నగదు తో పాటు కాయిన్ లను సైతం స్వాధీనం చేసుకున్నారు
