గోదావరి కి వరద ప్రవాహం అనూహ్యంగా పెరగడంతో మహా రాష్ట్ర వైపు రాకపోకలు నిలిపి వేశారు గురువారం సాయంత్రం పోలీస్ అధికారులు మహారాష్ట్రకు రాకపోకలను నిలిపివేస్తున్నట్లు తెలిపారు
గోదావరి త్రివేణి సంగమం వద్ద ప్రవహిస్తున్నది మంజీరా గోదావరి ప్రవాహం పెరిగింది బ్రిడ్జికి అనుకొని మీరు ప్రవహించడంతో ముందు జాగ్రత్తగా రాకపోకలను నిలిపివేశారు .
గోదావరి తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు గోదావరిలో నీటి వేగం గంట గంటకు పెరగడంతో కందకుర్తి వద్ద రాత్రికి మరింత నీరు పెరిగే అవకాశం ఉండడంతో పుష్కర ఘాట్ సైడు ఎవరు వెళ్లకూడదని ప్రజలకు అధికారులు సూచించారు
నిజాంబాద్ నుండి మహారాష్ట్ర ధర్మాబాదుగా వెళ్లే ప్రయాణికులు బాసరు వైపు నుండి వెళ్ళాలని లేదా బోధన్ సాలూరు నుండి వెళ్లాలని సూచించారు.
