మాజీ ప్రధాని, భారతరత్న లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల గారు తిలక్ గార్డెన్ చౌరస్తాలోని లాల్ బహదూర్ శాస్త్రి గారి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశం కోసం లాల్ బహదూర్ శాస్త్రి చేసిన సేవలు, ఆయన చూపిన నిజాయితీ, నిరాడంబరత, దేశభక్తి నేటి తరానికి ఆదర్శంగా నిలుస్తాయని అన్నారు. దేశ ప్రజల్లో ఐక్యతా భావాన్ని పెంపొందిస్తూ, దేశ అభివృద్ధి కోసం ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు.
“జై జవాన్.. జై కిసాన్” అనే నినాదంతో దేశ రక్షణలో సైనికుల పాత్రను, దేశ ఆహార భద్రతలో రైతుల ప్రాధాన్యతను శాస్త్రి చాటి చెప్పారని గణేష్ బిగాల అన్నారు.
లాల్ బహదూర్ శాస్త్రి ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని దేశ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ దండు నీతు కిరణ్ శేఖర్,నగర అధ్యక్షులు సిర్ప రాజు,మాజీ నూడ చైర్మెన్ ప్రభాకర్ రెడ్డి,సత్య ప్రకాష్,సుజిత్ సింగ్,జగత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
