HomeTelanganaNizamabadగాంధేయ మార్గం ఆదర్శం, అనుసరణీయం ...జయంతి వేడుకల్లో మేయర్..

గాంధేయ మార్గం ఆదర్శం, అనుసరణీయం …జయంతి వేడుకల్లో మేయర్..

గాంధేయ మార్గం అందరికి ఆదర్శం, అనుసరణీయమని నగర మేయర్ కూరగాయల ఉమారాణి అన్నారు. జాతిపిత మహాత్మాగాంధీ జయంతిని పురస్కరించుకుని శుక్రవారం నిజామాబాద్ నగరంలోని గాంధీచౌక్ లో గల మహాత్ముని విగ్రహానికి మేయర్ తో పాటు అదనపు కలెక్టర్ భుజంగరావు, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్ తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

అలాగే, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు.

ఇరువురు జాతి నేతలు దేశానికి అందించిన సేవల గురించి కొనియాడారు. మహనీయులు చూపిన బాటలో పయనిస్తూ దేశాభ్యున్నతికి, సమాజ హితానికి పాటుపడాలని వక్తలు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు, ఆయా సంఘాల ప్రతినిధులు, పుర ప్రముఖులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments