HomeLaw and Orderపెండింగ్ కేసులు త్వరగా క్లియర్ చేయాలి--పోలీస్ కమిషనర్ సాయి చైతన్య

పెండింగ్ కేసులు త్వరగా క్లియర్ చేయాలి–పోలీస్ కమిషనర్ సాయి చైతన్య

పోక్సో, గ్రేవ్ కేసులలో త్వరితగతిన ఇన్వేస్టిగేషన్ పూర్తి చేయాలి అసాంఘిక కార్యకలాపాలు గంజాయి, జూదం, పి.యడి. యస్ రైస్ అక్రమ రవాణలాంటి వాటిపై ప్రత్యేక దృష్టి, పటిష్టమైన చర్యలు .

సైబర్ నేరాల పై ప్రజలలో అవగాహణ కార్యక్రమాలను నిర్వహించాలి..రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక దృష్టి ప్రజలలో రోడ్డు భద్రత నిబంధనల పై అవగాహన కల్పించాలి.

పోలీస్ అధికారులతో నెలవారి సమీక్ష సమావేశం నిర్వహించిన పోలీస్ కమిషనర్ పెండింగ్ కేసులు లేకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరిస్తూ పెండింగ్ కేసుల సంఖ్య తగ్గించడానికి ప్రణాళిక ప్రకారం చర్యలు తీసుకోవాలని అధికారులను పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆదేశించారు.

గురువారం నిజామాబాద్ , ఆర్మూర్ , బోధన్ డివిజన్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ అధికారులతో పోలీస్ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ హాల్ యందు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, ఆధ్వర్యంలో నెలవారి సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. వినాయక చవితి , మిలాద్-ఉన్-నభీ పండుగలను శాంతియుతంగా నిర్వహించిన సిబ్బందికి అభినందనలు తెలియజేశారు.

ఈ సందర్భంగా ఉత్తమ విధినిర్వాహనలు నిర్వహించిన సిబ్బందికి “ప్రశంసా పత్రములను ” అందజేశారు. రాబోయే దేవినవరాత్రి ఉత్సవాలు , దీపావళి పండుగలను ప్రజలందరూ శాంతియుతంగా నిర్వహించేందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని తెలియజేశారు.

నిజామాబాద్ , ఆర్మూర్ ,బోధన్ డివిజన్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో పెండింగ్లో ఉన్న ( అండర్ ఇన్వేస్టిగేషన్) కేసులలో గ్రేవ్ , నాన్ గ్రేవ్ కేసుల గురించి అడిగి, గ్రేవ్ మరియు నాన్ గేవ్కేసులలో ఇన్వేస్టిగేషన్ చేసేటప్పుడు ప్రతీకేసులలో క్వాలిటీ ఇన్వేస్టిగేషన్తో పూర్తి పారదర్శకంగా చేయాలి అన్నారు.

కేసు నమోదు నుండి చార్జీషీటు వరకు ప్రతివిషయాన్ని కూలంకుశంగా పరిశోధన చేసి ఫైనల్ చేయాలి అని అన్నారు. పోక్సో మరియు గ్రేవ్ కేసులలో త్వరితగతిన ఇన్వేస్టిగేషన్ పూర్తి చేసి కోర్టులో చార్జీషీటు దాఖాలు చేయాలి అన్నారు.

ప్రతీ అధికారికి సి.సి.టి.ఎన్.ఎస్ పై పూర్తి అవగాహన కలిగి ఉండాలి అన్నారు. ఇన్వేస్టిగేషన్, స్టేషన్ మేనేజ్మెంటు తెలిసిఉండాలన్నారు. కొత్త కేసు లతో పాటు చాలా కాలంగా ఉన్న పెండింగ్ కేసులను ఎప్పటికప్పుడు సమీక్షించడం వలన కేసుల సంఖ్య.

తగ్గించే విధంగా అన్ని స్థాయిల అధికారులు పనిచేయాలని అన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిం చుకుంటూ ప్రజలకు అందుబాటులో ఉంటూ సమర్ధవంతమైన సేవలు అందజేస్తూ సత్వరన్యాయం చేసే లా కృషి చేయాలని అన్నారు.

గ్రామ పోలీస్ అధికారులు (వి.పి.ఓ) ప్రతీ రోజు గ్రామాన్ని సందర్శించి ప్రజలతో మమేకంమౌతూ నేర నియంత్రణకు కృషి చేయాలని అన్నారు.

కమ్యూనిటీ పోలీసింగ్ ద్వారా గ్రామాలలో సి.సి కెమెరాల ప్రాముఖ్యత అవగాహణ కల్పిస్తూ ఏర్పాటుకు కృషి చేయాలని అన్నారు. ముఖ్యంగా సైబర్ క్రైమ్, డయల్ 100 వాటి వినియోగం పై విద్యార్థులకు ప్రజలకు అవగాహణ కల్పించాలని అన్నారు.

ఆన్లైన్ మోసాలకు గురి అయినట్లయితే 1930 కాల్ చేసి లేదా ఎన్.సి.ఆర్.పి https://www.cybercrime.gov.ఇంకా పోర్టల్ యందు ఫిర్యాదు నమోదు చేయాలని అన్నారు.

రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక దృష్టి పెట్టాలని ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాలలో బ్లాక్ స్పాట్లుగా గుర్తించి సైన్బోర్డులను ఏర్పాటు చేయించాలని సూచించారు. హైవే రోడ్డులను కలుపుతుఉండే లింక్ రోడ్లకు స్పీడ్ కర్స్ వేయించడం రోడ్డుకు అడ్డుగా ఉన్న పొదలను తొలగించే విధంగా చూడాలని అన్నారు.

రోడ్డు ఇంజనీరింగ్లో లోపాలు ఉన్నట్లయితే నేషనల్ హైవే స్టేట్ హైవే అథారిటి ఇతర సంబంధిత అధికారులతో సమన్వయంతో ప్రమాదాల నివారణకు కృషి చేయాలని అన్నారు.

అలాగే రోడ్డు ప్రమాదాలు జరుగకుండా ప్రతీ రోజు మీ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రంకన్ డ్రైవ్ నిర్వహించి, ఓవర్ స్పీడ్, త్రిబల్ డ్రైవింగ్, మైనర్లు వాహనాలు నడుపుటలాంటి వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టి స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని అన్నారు.

విజిబుల్ పోలిసింగ్, పెట్రోలింగ్ ముమ్మరం చేయాలని, బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించ కుండా చర్యలు తీసుకోవాలని దొంగతనాలు జరగకుండా పాతనేరస్థుల కదలికలపై నిఘా ఉంచాలని అన్నారు.

అసాంఘిక కార్యకలాపాలు గంజాయి , ఇతర మాదకద్రవ్యాల అక్రమరవాణ క్రయవిక్రయాల పైన, జూదం , పి.డి.యస్. రైస్ అక్రమ రవాణలాంటి వాటిపై ప్రత్యేక దృష్టి సారించి పటిష్టమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు.

ఈ సందర్భంగా అదనపు డి.సి.పి (అడ్మిన్) బస్వారెడ్డి, నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ ఎ.సి.పి లు సి.ఐలు , ఎస్.ఐ లు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments