నిజామాబాద్,నగరంలో తిలక్ గార్డెన్‌లోని భారత్ గ్యాస్ ఏజెన్సీ కార్యాలయంలో ఆదివారం రాత్రి గుర్తుతెలియని దుండగులు చోరీకి పాల్పడి కలకలం సృష్టించారు.
ఏం జరిగింది?*దొంగలు రాత్రి వేళ ఏజెన్సీ ప్రధాన తాళాలు పగలగొట్టి లోపలికి చొరబడ్డారు. ముందుగా అప్రమత్తం కాకుండా ఉండేందుకు సీసీ కెమెరా వైర్లను కూడా కట్ చేసి ధ్వంసం చేశారు.
అనంతరం కార్యాలయంలో ఉన్న నగదు పెట్టెను ధ్వంసం చేసి డబ్బు ఎత్తుకెళ్లారు.
నష్టం అంచనా:ఈ చోరీలో దాదాపు రూ 70వేలు వరకు నగదు పోయినట్లు ఏజెన్సీ యాజమాన్యంపోలీసులకు ఇచ్చిన పిర్యాదు లో పేర్కొంది .
సీసీ కెమెరాల వైర్ లు ముందే తొలగించి ఈ చోరీ కి పాల్పడ్డారు .సమాచారం అందుకున్న వెంటనే స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. క్లూస్ టీమ్‌తో వేలిముద్రలు సేకరించారు. చుట్టుపక్కల ప్రాంతాల్లోని ఇతర సీసీటీవీ ఫుటేజీని పరిశీలించి దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్.ఐ తెలిపారు.పట్టపగ్గాలు లేకుండా పెరుగుతున్న చోరీలతో తిలక్ గార్డెన్ వ్యాపారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి పూట గస్తీ పెంచాలని కోరుతున్నారు..
