నిజామాబాద్ నగరంలో ని నాందేవాడలోని శ్రీ సాయిబాబా దేవాలయంలో తెల్లవారుజామున చోరీ యత్నం కలకలం రేపింది.పోలీసులురంగంలోకి దిగడంతో దొంగతనం జరగలేదు తెల్లవారుజామున ముగ్గురు అగంతకులు గుడి గేట్లు పగలగొట్టే ప్రయత్నం చేశారు.
వారు సృష్టించిన చప్పుడుతో అప్రమత్తమైన పక్కింటి వాసులు వెంటనే డయల్ 100 కి ఫోన్ చేశారు.*పోలీసుల చాకచక్యం:
సమాచారం అందుకున్న వెంటనే 3 టౌన్ పోలీసుల పెట్రోలింగ్ బైక్ మరియు పెట్రో కార్ సిబ్బంది స్పాట్‌కు చేరుకుని ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు రావడంతో దొంగలు పారిపోయేందుకు యత్నించినా ఫలించలేదు.*విచారణలో వెల్లడి:
పట్టుబడిన ముగ్గురు హర్యానా మరియు పంజాబ్ రాష్ట్రాలకు చెందినవారిగా గుర్తించారు. ప్రస్తుతం వారిని 3 టౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారిస్తున్నారు.
వీరు ఇంతకుముందు ఇలాంటి నేరాలకు పాల్పడ్డారా అనే కోణంలోనూ పోలీసులు ఆరా తీస్తున్నారు.పక్కింటివారి అప్రమత్తతతో పెద్ద అనర్థం తప్పింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు 3 టౌన్ ఎస్.ఐ తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
