ప్రభుత్వ ఖజానా కునయా పైసా ఇవ్వక పోయినా సరే అధికారులను మమ్ముళ్ల మత్తు లో ముంచితే చాలు ఎలాంటి అక్రమ దందా లైన సరే దర్జాగా చేసుకోవచ్చు ! మారు మూల ప్రాంతాల్లో కాదు జిల్లా కేంద్రంలో నే ! అధికారులు ఎవరికి కావాల్సిన వాటాలు వారు గుట్టుగా మెక్కేసి మైనింగ్ దందాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారు.
గతంలో మైనింగ్ లో అక్రమాలకు పాల్పడిన అభియోగాల మీద మేయర్ భర్త ను బైండోవర్ చేసారు.. అక్రమ మైనింగ్ కు పాల్పడిన వారి భరతం పడుతామని గతంలో పోలీసు పెద్దలు బీరాలు పలికారు కానీ కొద్దికి నెలల గడువులోనే అధికార పార్టీ నేతల ముసుగు లో మొరం మాఫియా రంగంలోకి దిగింది ఈసారి ప్రభుత్వ భూముల జోలికి వెళ్లకుండా గోశాల భూముల ను చెరబట్టారు.
కొద్దీ రోజుల వ్యవధి లోనే గోశాల భూముల్లో గుట్టలను తవ్వేశారు రాత్రి పగలు తేడా లేకుండా తవ్వకాలు ఆ వెంటనే అక్రమ రవాణా లు సాగించారు తిలా పాపం తలా పిడికెడు అన్న చందంగా ఈ అక్రమ మైనింగ్ దందా యథేచ్ఛగా సాగడంలో తలా ఒక్కరు తమవంతు పాత్ర పోషించారు.
రోజుల తరబడిగా తమ కళ్ళ ముందే ఈ దందా సాగుతున్న తమకేమి పట్టనట్లుగా ఉండి పోయిన యంత్రాంగం ,నిఘా వ్యవస్థ తమకేమి పట్టనట్లుగా వుండడం ఫై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి .
జిల్లాలో అనేక ప్రాంతాల్లో మైనింగ్ దందాలు యదేచ్చగా సాగుతున్నాయి. మొరం ..క్వారీ …ఇసుక ఇవ్వన్ని మైనింగ్ దందాలే .ఎదో మొక్కబడిగా అనుమతులు తీసుకోవడం ఆ ముసుగులో అక్రమాలు తెరలేపడం షరా మాములే కదా .రెవెన్యూ గనుల శాఖ ల అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలన తర్వాతే మొరం, ఇసుక తవ్వకాలకు అనుమతులు ఇస్తారు. అలాగే క్వారీలు కూడా .
నిర్దేశిత ప్రాంతాల్లో నిర్దిష్టమైన కొలతల మేరకే తవ్వకాలు చేయాలి ఇసుక, మొరం రవాణా చెయ్యాలి ,ఆయా ప్రాంతాల్లో తవ్విన ఇసుక మొరం లను పర్మిట్ లతోనే ఆయా ప్రాంతాలకు తరలించాలి. కానీ ఎదో మొక్కబడిగా అనుమతులు పొందే గుత్తేదార్లు లెక్కకు మించి మొరం తవ్వేస్తూ గుట్టుగా తరలిస్తారు .
స్థానికంగా ఉన్న చోటామోటా లీడర్ల లను సైతం ఎదో రకంగా మేనేజ్ చెయ్యాలి.కానీ వాటిని దర్జాగా రవాణా చేయాలంటే పోలీసు రెవెన్యూ అధికారులను ముందే మామూళ్ల ఒప్పందాలు చేసుకోవాల్సిందే. ఇదేమి గుట్టుగా సాగేది కాదు. గుత్తేదార్లు రెవెన్యూ పోలీసు అధికారులకు మామూళ్లు ముట్టజెప్పకే వాహనాలు రోడ్డెక్కుతాయి.
ఇందులో దాపరికమేమి లేదు అందరికి తెలిసిందే.అంతే కాదు రచ్చ చేయకుండా స్థానిక మీడియా ను సైతం నయానో భయానో మేనేజ్ చేయాల్సిందే. ఎవరెవరికి ఎంత మొత్తం ఇవ్వాలనేది గుత్తేదార్లు ముందే ఓ అంచనాకు వచ్చేస్తారు.తమ గిట్టుబాటు ఏ మాత్రం తగ్గకుండానే ముడుపులు వెదజల్లుతారు.
గత కొద్దీ రోజులుగా ఈ అక్రమ మైనింగ్ దందా మూడుజెసిబి లు ఆరు టిప్పర్ లు అన్న చందంగా సాగుతుంది. కానీ నాగారం లోని గోశాల భూముల్లో గత కొద్దీ రోజులుగా సాగుతున్న మొరం తవ్వకాలకు అసలు రెవెన్యూ మైనింగ్ శాఖల నుంచి ఎలాంటి అనుమతులు లేవు.
గతంలో మైనింగ్ ఆరోపణలపై ఏకంగా మాజీ మేయర్ భర్త ను బైండోవర్ చేసిన పోలీస్ లు ఇప్పడు తన స్టేషన్ మీదుగా నగర పురవీధుల్లో మొరం టిప్పర్లు దూసుక పోతున్న లైట్ తీసుకుంటున్నారు.
