మాయమాటల ఇంట్లోకి వెళ్లిన ఓ వ్యక్తి బ్రాంచ్ పోస్ట్ మ్యాన్ నుంచి ఏకంగా ఆసరా పెన్షన్ సొమ్ము చోరి చేశారు. ఈ ఘటన మాక్లూర్ మండల పరిధిలో జరిగింది.మామిడి పల్లి కి చెందిన బిపీఎం నరేందర్ ఆగస్టు 29 న నిజామాబాద్ కేంద్రంలోని పోస్ట్ ఆఫీస్ నుంచి 8 లక్షల రూపాయలు ఆసరా పెన్షన్ పంపిణీ చేయడానికి తీసుకెళ్ళాడు.దీంతో అతని స్నేహితుడు,మరో వ్యక్తి తో కలిసి ఆ సొమ్మును కాజేయడానికి పక్కగా ప్లాన్ వేసారు.ఎప్పటి లాగే నరేంద్ర పోస్ట్ ఆఫీస్ నుంచి 8 లక్షల రూపాయలను బ్యాగ్ లో తీసుకు వచ్చి ఇంట్లో భద్రంగా దాచుకున్నాడు. స్నేహితుడు, గుర్తు తెలియని వ్యక్తినీ నరేంద్ర ఇంటికి పంపాడు.అతను నరేంద్ర తో మాటలు కలిపి రాత్రికి అక్కడే ఉండి గుట్టుగా బ్యాగ్ నుంచి రూ 8 లక్షలు కాజేసి పరారయ్యారు.దీంతో కాసేపటికి గమనించిన బీపీయం నరేంద్ర పక్కన చూసేసరికి సదరు వ్యక్తి కనిపించకపోవడంతో చుట్టూ చూసిన కనిపించలేదు.వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు.పోలీసులు కేసు దర్యాప్తు చేసి ఎట్టకేలకు నిందితులను పట్టుకున్నట్లు సమాచారం.
