.క్రిప్టో కరెన్సీ మోసాలకు పాల్పడుతున్న ముఠా గుట్టును సీసీఎస్ పోలీసులు రట్టు చేశారు. నిరక్షరాస్యులు, అమాయకులనే కాకుండా ఉన్నత విద్యావంతులు, అడ్వకేట్ వంటి మేధావులను సైతం వదలడం లేదు.
జిల్లాలోని అనేక మంది బాధితులు సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకుని విలవిలలాడి పోతున్నారు.తాజాగా క్రిప్టో కరెన్సీ మోసాలకు పాల్పడుతున్న మహ్మద్ మొయిజ్ ఖాన్, అమిద్ హాసన్ అనే ఇద్దరిని పట్టుకొని అరెస్ట్ చేసినట్లు సీసీఎస్ ఏసిపి నాగేంద్ర చారి తెలిపారు.
బుదవారం జిల్లా కేంద్రంలోని సీసీఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..స్ట్రెయిమ్ ఎవర్ గ్రీన్ కంపెనీ పేరుతో మల్టీ-లెవల్ మార్కెటింగ్ ద్వారా వీరు రూ.8.5 కోట్ల మోసానికి పాల్పడ్డారనీ తెలిపారు.
అలాగే వీరు నిజామాబాద్ కు చెందిన సుమారు 125 మందిని మోసం చేశారని అన్నారు.ఇంక చాలా మంది బాధితులు ఉన్నారన్నారు.
ఇందల్వాయి మండలంలో ఉపాధ్యాయుడిగా ఉద్యోగం చేస్తున్న హకీమ్ కి మహమ్మద్ మోహిజ్ ఖాన్ అతని స్నేహితుడు సయ్యద్ హైమద్ అస్సేన్ మరి కొందరు కలిసి తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆశలు మోసం చేశారని అన్నారు.
దీంతో బాధితుడు ఇందల్వాయి పోలీస్ స్టేషన్ లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు చేశారు. సీసీఎస్ ఏసిపి ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని హస్సీ కాలానికి చెందిన మహమ్మద్ మోహిజ్ ఖాన్ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేశాడు.
అతని స్నేహితుడు అయిన సయ్యద్ హైమద్ అస్సేన్,అలాగే హాజిద్ ఉస్మాన్ మరి కొందరు కలిసి 2022_23 నుంచి స్ట్రెయిమ్ ఎవర్ గ్రీన్ కంపెనీ పేరుతో మల్టీ-లెవల్ మార్కెటింగ్ ద్వారా సమావేశాలు నిర్వహిస్తూ అందులో బాధితులను చేర్చి మోసానికి పాల్పడ్డారనీ తెలిపారు.
వీరు యుఎస్ డాలర్ ను కూడా ట్రేడింగ్ చేస్తున్నారని తెలిపారు.అలాగే హైదారాబాద్ సమీపంలో మూవ్ ఆన్ అనే కంపెనీ పెట్టడానికి భూమి యజమానికి కొంత అడ్వాన్స్ ఇచ్చి అతనికి కూడా ఇవేస్ట్ పేరుతో డబ్బుకు తీసుకొని పరారైనట్లు విచారణలో తేలిందని అన్నారు.
వారి పథకం ప్రకారం, వారు Profitreehub.com, Scotraprofit.com అనే ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌లను సృష్టించి, వివిధ వ్యక్తుల నుండి డబ్బును వసూలు చేశారనీ తెలిపారు. వారు కంపెనీలో భాగం కాని మోవన్ ఇన్ఫ్రా స్ట్రక్చర్ కంపెనీ పేరుతో డబ్బును వసూలు చేసి, ప్రజలను మోసం చేశారని అన్నారు.
బహుమతి పేరుతో థాయిలాండ్ గోవాకు డబ్బు చెల్లించిన వ్యక్తులను కూడా వారు పిలిచారు. నిందితులు మాదకద్రవ్యాలను సేవించేవారనీ పేర్కొన్నారు. ఈ సమావేశంలో సీసీఎస్ సీఐ సురేష్ సిబ్బంది పాల్గొన్నారు.
