నెలవారీ ఖర్చులతో తడిసి మోపెడవుతున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం నూతన జీఎస్టీ శ్లాబ్‌లలో మార్పులు చేస్తూ తీసుకున్న నిర్ణయం పేద, మధ్య తరగతి ప్రజలకు పెద్ద ఊరట కలిగించనుందనీ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ తెలిపారు.
దేశ ప్రధాని నరేంద్ర మోదీ నవరాత్రి సందర్భంగా దేశ ప్రజలకు భారీ బహుమతి ఇచ్చారని తెలిపారు.వాహనాల ధరలపై జీఎస్టీని 28 శాతం నుంచి 18 శాతానికి కేంద్రం కుదించింది. దీంతో వీటి ధరలు తగ్గనున్నాయి.
ఇప్పటికే బైక్, కార్ల కంపెనీలు తగ్గించిన ధరలను ప్రకటించాయి. బైక్ పై రూ.5 వేల నుంచి రూ.20 వేల వరకు, మధ్యస్థాయి కారుపై రూ.1.5 లక్షల వరకు తగ్గింపు ఉండనుంది. లగ్జరీ కార్లపై 40శాతం జీఎస్టీ విధించారు.
అలాగే జీఎస్టీ శ్లాబ్‌లలో మార్పులతో నిత్యావసర వస్తువుల ధరలు తగ్గనున్నాయనీ తెలిపారు. షాంపూలు, సబ్బులు, టూత్ పేస్ట్, టూత్ బ్రష్, రేజర్లు, బేబీ డైపర్లు వంటి హ్యుజ్ వినియోగ వస్తువులు చౌకగా లభించనున్నాయి.
ఇప్పటికే అనేక తయారీ సంస్థలు తమ ఉత్పత్తుల ధరలను తగ్గిస్తున్నట్లు ప్రకటించాయనీ అన్నారు. రానున్న జీఎస్టీ కొత్త శ్లాబ్‌లు 5 శాతం, 18 శాతం మాత్రమే ఉండనున్నాయి. దాదాపుగా 200పైగా వస్తువులపై పన్ను తగ్గించి సామాన్యులకు కేంద్రం ఊరట కల్పించిందను పేర్కొన్నారు.
గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్స్ కూడా 28% నుంచి 18% స్లాబ్‌లోకి తగ్గనున్నాయి. ఎయిర్ కండిషనర్లు, రిఫ్రిజిరేటర్లు, డిష్‌వాషర్లు, పెద్ద స్క్రీన్ టీవీలు, సిమెంట్ వంటి వస్తువులు ఉంటాయి. ఇక ఆటోమొబైల్ రంగంలో చిన్న కారు మోడల్స్ 28% నుండి 18%కి తగ్గవచ్చు.
ద్విచక్ర వాహనాలు కూడా తక్కువ స్లాబ్‌లోకి మారవచ్చు. లగ్జరీ కార్లపై అధిక పన్ను కొనసాగుతుంది. భీమా, ఆర్థిక సేవల వర్గంలో, ప్రీమియంలు 18% జిఎస్టి ఉన్నాయి. కంసోటిక్స్ పైన 30 నుంచి 5 శాతం కు తగ్గించినట్లు తెలిపారు.
ఈ జిఎస్టి తగ్గడంతో ప్రతి పేద కుటుంబానికి 4000 నుంచి 5000 వరకు ఖర్చు తగ్గుతుందని పేర్కొన్నారు.కేంద్రం జీఎస్టీని సవరించడంతో రాష్ట్రానికి దాదాపు రూ.7 వేల కోట్లు ఆదాయం తగ్గిందని రాష్ట్రానికి జరిగే ఈ నష్టాన్ని కేంద్రమే పూడ్చాలని రేవంత్ రెడ్డి మాటలకు కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయం కాదని రాష్ట్రం ప్రభుత్యం కమిటీలో లేదా అని ప్రశ్నించారు.
రాష్ట్ర ప్రభుత్వంకు ఎంత నష్టం ఉందో కేంద్రానికి కూడా అంతే నష్టం ఉంటుందని అన్నారు. కానీ పేద ప్రజలకు అధిక ధరలతో కొంత ఉపశమనం లభిస్తుందనీ అన్నారు. అందుకే పండగ చేస్తున్నామని అన్నారు. ప్రజలను దోసుకోవడం తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం కు మరేమీ లేదని ఆగ్రహించారు.
ఇక కేసీఆర్ హయంలో పెట్రోల్ ధరలు కూడా భారీగా ఉండేయని,అన్ని రాష్ట్రాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు తగ్గించనా కేసీఆర్ తగ్గించలేదని పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడూ వచ్చినా జెండా ఎగరవేస్తామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ,పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు స్రవంతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
