Thursday, April 16, 2026
HomeTelanganaNizamabadస్థానిక సంస్థల కు ఎన్నికల షెడ్యూల్ విడుదల

స్థానిక సంస్థల కు ఎన్నికల షెడ్యూల్ విడుదల

ఆక్టోబర్ 9 నుంచి నామినేషన్ ప్రక్రియ ప్రారంభం

మొదటగా అక్టోబర్ 23, 27న రెండు దశల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు

తర్వాత అక్టోబర్ 30, నవంబర్ 4, 8న మూడు దశల్లో సర్పంచ్ ఎన్నికలు

నేటి నుంచే ఎన్నికల కోడ్ అమలు

ఎట్టకేలకు స్థానిక ఎన్నికల షెడ్యూల్

ఎట్టకేలకు స్థానిక సంస్తలకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసింది.అక్టోబర్ 9న స్థానిక ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ విడుదల చేస్తామని తెలిపారు. 31 జిల్లాల్లో 565 మండలాల్లో రెండు విడతల్లో 5,749 ఎంపీటీసీ, 656 జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించనున్నారు . అదేవిధంగా పంచాయతీ ఎన్నికలను మూడు విడతల్లో నిర్వహిస్తామని వెల్లడించారు.

స్థానిక ఎన్నికల నిర్వహణ ప్రక్రియ అక్టోబర్ 9న ప్రారంభమై.. నవంబర్ 9తో ముగుస్తుందని తెలిపారు. ఈ క్షణం నుంచి రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని ప్రకటించారు.

అక్టోబర్ 23, 27న ఎంపీటీసీ ఎన్నికలు, అక్టోబర్ 31, నవంబర్ 4, 8 తేదీల్లో పంచాయతీ ఎన్నికలను విడతల వారీగా నిర్వహిస్తామని తెలిపారు. నవంబర్ 11న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల తుది ఫలితాలను వెల్లడిస్తామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని ప్రకటించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!