హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్‌గా వీసీ సజ్జనార్ బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు కమిషనర్‌గా ఉన్న సీవీ ఆనంద్ నుంచి బాధ్యతలు స్వీకరించారు.
ఈ సందర్భంగా సజ్జనార్ మాట్లాడుతూ.. ఆర్టీసీకి నాలుగేళ్లు సేవలు అందించడం సంతృప్తినిచ్చిందని, సమష్టికృషితో సంస్థలో వినూత్న కార్యక్రమాలు చేపట్టి విజయవంతం చేశామని సజ్జనార్ అన్నారు.
హైదరాబాద్‌లో సైబర్ నేరాలు, ఆర్థిక మోసాలను అరికట్టడం తన ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ముఖ్యంగా రౌడీషీటర్ల అరాచకాలపై ఉక్కుపాదం మోపుతామని.. వారు ఎవరైనా గీత దాటితే వారిపై పీడీ యాక్ట్‌లు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
