పల్లెల్లో మొదలైన.. ఎన్నికల ఫీవర్ – నాయకులను ప్రసన్నం చేసుకోవడంలో నిమగ్నమైన ఆశవాహులు – అధికార కాంగ్రెస్ బిజెపిల మధ్య పోటీ నెలకొననుందా? – గ్రామాల్లో జోరుగా కొనసాగుతున్న చర్చ – బాల్కొండ మినహా అన్ని నియోజకవర్గాల్లో కనబడని కారు జోరు – అభ్యర్థుల ఎంపిక కోసం రహస్యంగా ప్రధాన పార్టీల సర్వే ? జాన రమేష్ ఇది సంగతి ఆర్మూర్ :
స్థానిక సంస్థల ఎన్నికల నగర మోగింది . పల్లెల్లో ఎన్నికల ఫీవర్ మొదలైంది. గ్రామ పోరుకు అధికార యంత్రాంగం బిజీ అయ్యారు. ఆశావాహులు కూడ బడా నేతలను ప్రసన్నం చేసుకుంటున్నారు.
అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోరు ఎలా ఉండబోతుంది? ఆయా పార్టీల బలాబలాలు ఎలా ఉండబోతున్నాయి? అన్న దానిమీద జోరుగా చర్చ కొనసాగుతుంది. స్థానిక సంస్థల ఎన్నికల కోసం అక్టోబర్ 9న నోటిఫికేషన్ విడుదల కానుంది.
నవంబర్ 11వ తేదీన ఎన్నికల నిర్వహణ తర్వాత ఫలితాలు తెలనున్నాయి. మరోపక్క అధికార కాంగ్రెస్ పార్టీ 42 శాతం రిజర్వేషన్ తో బీసీలకు ప్రాధాన్యం కల్పిస్తామని నినాదంతో ముందుకు వెళుతుంది.
నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 31 జడ్పిటిసి స్థానాలు ఉన్నాయి. అంతేగాక ఆయా స్థానాల రిజర్వేషన్లు కూడా ఖరారు అయ్యాయి. దాదాపుగా పల్లెల్లో ఎన్నికల సమరం ప్రారంభమైంది.
ఆశావాహులు ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి సమాలోచనలు జరుపుతున్నారు. అన్ని ప్రధాన పార్టీల నేతలతో ఎంపీటీసీ , జడ్పిటిసి స్థానాలకు తమకు స్థానం కల్పించాలని ఆయా పార్టీల నేతలను ఆశవాహులు కలుస్తున్నారు.
నిజామాబాద్ జిల్లాలో అధికార కాంగ్రెస్ తో పాటు బిజెపి పార్టీ నాయకులను ఎక్కువ సంఖ్యలో ఆశవాహులు కలుస్తూ ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 23 నెలలకు స్థానిక సమరానికి నోటిఫికేషన్ వెలవడంతో ఆశావాహులు తమ తమ ప్రయత్నాలను గట్టిగా కొనసాగించే పనిలో ఉన్నారు.
స్థానిక సమరానికి ఎన్నికల కమిషన్ నుంచి స్పష్టత రావడంతో ఆశావాహులంతా తమ ప్రయత్నాలలో మునిగితేలుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 31 మండలాల్లో అధికార కాంగ్రెస్ పార్టీ అగ్ర నేతలు తమకు అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయాలని ఆశావాహులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
మరోపక్క తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నిజామాబాద్ జిల్లాకి చెందిన వ్యక్తి కావడంతో ఎవరికి వారే ఆశవాహులు తమ ప్రయత్నాలని ముమ్మరం చేశారు.- కమలం వికసించేనా..? మరోవైపు బిజెపి కూడా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో బాగా వేసేందుకు అన్ని ప్రయత్నాలు కొనసాగిస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ సత్తా చాటినందుకు బిజెపి కూడా ప్రయత్నిస్తోంది.
జిల్లా పరిషత్ ను కైవసం చేసుకునేందుకు ఎంపీ అరవింద్ క్షేత్రస్థాయిలో రాజకీయ వ్యూహాన్ని రచిస్తున్నారు. అంతేకాకుండా నగరపాలక సంస్థలతో పాటు జిల్లాలో ఉన్న మూడు మున్సిపల్ లలో పాదాభివసేందుకు వ్యూహరచన చేస్తుంది.- హస్తం పై చేయి సాధించేనా..?అధికార కాంగ్రెస్ సైతం అభివృద్ధి మంత్రంతో జడ్పీ పీఠంతోపాటు నగర మేయర్ 3 మున్సిపల్ లలో తమ పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తోంది.
దాదాపుగా ఇప్పటికే ఈ రెండు ప్రధాన పార్టీలు అభ్యర్థుల బలబలాలను కూడా క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించినట్లు తెలుస్తోంది. ఎవరిని బరిలో నిలిపితే అధికారం కైవసం చేసుకోవచ్చు అన్నయ్య అంశంపై కాంగ్రెస్ కూడా కసరత్తు చేస్తుంది.- కారు జోరు పెరిగెనా..?గతంలో జడ్పీ పీఠంతోపాటు నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న మూడు మున్సిపాలిటీలను నగర కార్పొరేషన్ కైవసం చేసుకొని గులాబీ దళం జిల్లాలో తమ అధిపత్యాన్ని చాటుకున్నారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత 10 సంవత్సరాలు కారు జోరు జిల్లాలో కొనసాగింది. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో పరాభవాన్ని ఎదురుచూసిన మాజీ ఎమ్మెల్యేలు గత కొన్ని రోజులుగా కొన్ని నియోజకవర్గాల్లో కనీసం కన్నీటి కూడా చూసిన పాపాన పోలేదు.
నియోజకవర్గాలకు దూరంగా ఉండటంతో కార్యకర్తల్లో నిరాశ నెలకొంది. ఒక్క బాల్కొండ నియోజకవర్గం మినహా అన్ని నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి కనబడుతున్నట్టు తెలుస్తోంది. గత 23 నెలల కాంగ్రెస్ పరిపాలనలో నెలకొన్న కొన్ని వైఫల్యాలని తమ ప్రచార స్థలాలుగా మలుచుకోవడంలో అధికారం కోల్పోయిన టిఆర్ఎస్ ఎంతవరకు సఫలం అవుతుందో అన్న ప్రశ్న తలెత్తుతుంది.
మొత్తానికి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న 9 నియోజకవర్గాల్లో ఐదు గురు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉండగా ఒక బాల్కొండ నియోజకవర్గం లో మాత్రమే మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి టిఆర్ఎస్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.
అంతేకాకుండా గత పార్లమెంటు ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపి తన ఆదిత్యాన్ని కనపరచుకున్న నేపథ్యంలో రామన్న స్థానిక సంస్థల్లో ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనే చర్చ సామాన్య ప్రజల్లో జోరుగా కొనసాగుతుంది.
