HomeTelanganaNizamabadరెండు ఎన్నికలు ....రెండు విడతల్లో స్థానిక సంస్థల ఎన్నికల ఫై యంత్రాంగం సమాయత్తం ......అమల్లోకి...

రెండు ఎన్నికలు ….రెండు విడతల్లో స్థానిక సంస్థల ఎన్నికల ఫై యంత్రాంగం సమాయత్తం ……అమల్లోకి వచ్చిన ఎన్నికల ఆంక్షలు

స్థానిక సంస్థల ఎన్నికల లను పగడ్బందీగా నిర్వహించడానికి యంత్రాంగం సమాయత్తం అవుతుంది.రెండు ఎన్నికలు రెండు విడతల్లో నిర్వహించడానికి సమాయత్తం అవుతున్నారు. జిల్లాలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు రెండు దఫాల్లో , గ్రామ పంచాయతీ రెండు విడతలలో పోలింగ్ నిర్వహించనున్నారు.

ఎన్నికల నిర్వహణ అంశాలపై సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ భవనంలోని సమావేశ మందిరంలో మంగళవారం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు.

ఆయా పార్టీలకు దిశా నిర్దేశం చేశారు. ఎన్నికల షెడ్యూల్ వెలువడినందున రాజకీయ పార్టీలకు సంబంధించిన వాల్ రైటింగ్, ఫ్లెక్సీలు, హోర్డింగులు, ఫోటోలను ప్రభుత్వ కార్యాలయాల్లో 24 గంటల వ్యవధిలో, బస్ స్టాండ్, రైల్వే స్టేషన్, పెట్రోల్ బంక్ తదితర ప్రదేశాలలో 48 గంటల వ్యవధిలో, అనుమతి లేని ప్రైవేట్ స్థలాలలో 72 గంటల వ్యవధిలో పూర్తి స్థాయిలో తొలగించాలని కలెక్టర్ ఆదేశించారు .

అక్టోబర్ 9 న నోటిఫికేషన్ ఇవ్వనున్నారు , ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఫేజ్ – I ఎన్నికలకు సంబంధించి అక్టోబర్ 9 నుండి 11 వరకు ఉదయం 10.30 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ల స్వీకరించడం జరుగుతుందని, అక్టోబర్ 23న మొదటి విడత పోలింగ్ జరుగుతుందని తెలిపారు.

ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఫేజ్ – II ఎన్నికలకు సంబంధించి అక్టోబర్ 13 నుండి 15వ వరకు ఉదయం 10.30 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ల స్వీకరించడం జరుగుతుందని, అక్టోబర్ 27 న రెండవ విడత పోలింగ్ జరుగుతుందని తెలిపారు.

నవంబర్ 11న ఓట్ల లెక్కింపు ఉంది . గ్రామ పంచాయతీ ఫేజ్–I ఎన్నికలకు సంబంధించి అక్టోబర్ 21 నుండి 23 వరకు ఉదయం 10.30 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నరు , నవంబర్ 4న మొదటి పోలింగ్ ఉంది . గ్రామ పంచాయతీ ఫేజ్–II ఎన్నికలకు సంబంధించి అక్టోబర్ 25 నుండి 27 వరకు ఉదయం 10.30 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ల స్వీకరిస్తారు .

నవంబర్ 8న రెండవ విడత పోలింగ్ జరుగుతుందని తెలిపారు. మొదటి, రెండవ విడతలలోనూ ఉదయం 7.00 గంటల నుండి మధ్యాహ్నం 1.00 గంట వరకు పోలింగ్ జరుగుతుందని, అనంతరం పోలింగ్ రోజునే మధ్యాహ్నం 2.00 గంటల నుండి కౌంటింగ్ జరిపి ఫలితాలు వెల్లడించనున్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments