HomeCRIMEహత్య కేసులో నిందితుడికి రిమాండ్...

హత్య కేసులో నిందితుడికి రిమాండ్…

నగరంలోనీ ఒకటవ టౌన్ పరిధిలో ఓ వ్యక్తిని హత్య చేసిన ఘటనలో నిందితుడిని రిమాండ్ కు తరలించినట్లు ఎస్హెచ్ఓ రఘుపతి తెలిపారు. ఆయన వెల్లడించిన వివరాల ప్రకారం..

నగరంలోని రైల్వే స్టేషన్ ఎదురుగా ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం పడి ఉండడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించగా ఎవరో హత్య చేసి ఉన్నట్లు విచారణలో తేలిందనీ అన్నారు.

దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా కోటగిరి మండలం జల్లపల్లి ఫారం కు చెందిన షేక్ అహ్మద్ హత్య చేసినట్లు విచారణలో గుర్తించారు తేలింది.

ఈ మేరకు మంగళవారం నిందితుడు షేక్ అహ్మద్ ను పట్టుకొని విచారించగా రూ 2000, ఫోన్ కోసం అతన్ని హత్య చేసినట్లు ఒప్పుకున్నాడని తెలిపారు.

నిందితుడు షేక్ అహ్మద్ పై 2017 లో నాందేడ్ లో కూడా మర్డర్ కేసు ఉన్నట్లు తెలిపారు.నిందితుడిని రిమాండ్ కు తరలించినట్లు ఒకటవ టౌన్ ఎస్హెచ్ఓ రఘుపతి తెలిపారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments