HomeLaw and Orderపక్కాగా అసైన్డ్, భూదాన్, ప్రభుత్వ భూముల సర్వే కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి

పక్కాగా అసైన్డ్, భూదాన్, ప్రభుత్వ భూముల సర్వే కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి

జిల్లాలోని ఆయా మండలాలో గల అసైన్డ్ భూములు, భూదాన్, ప్రభుత్వ భూముల సర్వేను పక్కాగా జరిపించాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. సోమవారం ఆయన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం నుండి సబ్ కలెక్టర్లు, ఆర్డీఓ, అన్ని మండలాల తహసిల్దార్లతో వీడియో కాన్ఫరెన్సు ద్వారా రెవెన్యూ అంశాలపై సమీక్ష నిర్వహించారు.

రెవెన్యూ రికార్డుల ఆధారంగా అసైన్డ్, భూదాన్ భూములను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ, సర్వేయర్లచే పక్కాగా సర్వే జరిపించి, విస్తీర్ణం, హద్దులు, సర్వే నెంబర్ తదితర సమగ్ర వివరాలను సేకరించాలని, జియో ట్యాగింగ్ చేయాలని సూచించారు.

భూభారతి దరఖాస్తుల సత్వర పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. గ్రామాల వారీగా నిర్వహించిన రెవెన్యూ సదస్సులలో సేకరించిన దరఖాస్తుల కంటే ముందు ఆన్లైన్ లో వచ్చిన పెండింగ్ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు.

ఇప్పటికే ఆర్జీలను ఆయా మాడ్యుల్స్ లో విభజించిన నేపధ్యంలో, ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి, క్షేత్రస్థాయిలో సమగ్ర విచారణ జరపాలని అన్నారు. సాదా బైనామా దరఖాస్తులను జాగ్రత్తగా పరిశీలిస్తూ, రెవెన్యూ రికార్డులతో సరిపోల్చుకుని పక్కాగా ఫీల్డ్ వెరిఫికేషన్ చేయించాలని ఆదేశించారు.

ఫీల్డ్ వెరిఫికేషన్ కోసం గ్రామ పాలన అధికారుల సేవలను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని కలెక్టర్ సూచించారు. వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, సబ్ కలెక్టర్లు వికాస్ మహతో, అభిగ్యాన్ మాల్వియ, ఆర్డీఓ రాజేంద్రకుమార్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏ.డీ అశోక్, అన్ని మండలాల తహసిల్దార్లు, సర్వేయర్లు, గ్రామ పాలన అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments