మావోయిస్టు పార్టీ అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ సోను అలియాస్ అభయ్ సరెండర్ అయ్యారు. దాదాపు 60 మందితో కలిసి మహారాష్ట్రలోని గడ్చిరౌలి పోలీసుల ముందు మల్లోజుల లొంగిపోయారు.
మావోయిస్టు పార్టీలో అగ్రనేతగా ఉన్న మల్లోజుల వేణుగోపాల్ రావు ఇటీవల పార్టీ ప్రస్తుత విధానాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ లేఖ రాసిన విషయం తెలిసిందే.
