పేదలకడుపు నింపడానికి కేంద్రం ఎన్నో వ్యయ ప్రయాసలు ఓర్చి అందిస్తున్న రేషన్ బియ్యం పక్క దారి పడుతుంది. కొందరు మిల్లర్ల దళారుల ద్వారా పేదలకు పంపిణీ చేసిన ప్రభుత్వ పిడిఎస్ బియ్యాన్ని అక్రమార్గంలో కొని సొమ్ము చేసుకుంటున్నారు.
దశాబ్దాలుగా ఈ దందా సాగుతున్నది. బోధన్ ప్రాంతానికి చెందిన ఓ మిల్లర్ ఈ దందా కింగ్ పిన్ గా చెప్తున్నారు. ఆదిలాబాద్ నిజామాబాద్ జిల్లాల నుంచి భారీఎత్తున రేషన్ బియ్యం డీలర్ల నుంచి గంప గుత్తగా తీసుకొని లారీల్లో సరిహద్దు లు దాటిస్తున్నారు.
గతంలో రేషన్ షాప్ ల్లో పేదలకు దొడ్డు బియ్యం ఇచ్చిన సర్కార్ ఇప్పుడు సన్నబియ్యం ఇస్తుంది. నిజానికి రేషన్ షాప్ ల్లో సన్నబియ్యం ఇస్తేబియ్యం అక్రందందా ను అరికట్టవచ్చని ప్రభుత్వం భావించింది కానీ పీడీఎస్ మాఫియా ఈ దందా మరింత జోరుగా సాగిస్తుండడం గమనార్హం.
జిల్లాలో ఈ తరహా దందా సాగించే ముఠాలు అర డజన్ దాక ఉన్నాయి. నిజామాబాద్ బోధన్ సిరికొండ ఆర్మూర్ ప్రాంతాల్లో ఈ ముఠాలు రేషన్ డీలర్ల తో లోకపాయికారి ఒప్పందాలు చేసుకోని బియ్యం ముందుగా రహస్య ప్రాంతాల్లో నిల్వ చేసి ఆ తర్వాత గుట్టుగా తరలిస్తారు.
పీడీఎస్ దందా లో అనేక వ్యవస్థలున్నాయి. పేదలనుంచి నగదు ఆశ చూపి రేషన్ షాప్ నుంచి బియ్యం తీసుకోగానే తీసుకుంటున్నారు. సన్న బియ్యం ను దళారులకు అమ్ముకుంటున్న పేదలు తక్కువ నాణ్యత ఉండే బియ్యం కొని జీవనం సాగిస్తున్నారు.
పేదల నుంచి కొనుగోలు చేసిన బియ్యం ను తమ స్థావరాల్లో నిల్వ చేస్తున్న మాఫియా లోడ్ ల లెక్కన పొరుగు రాష్ట్రాలకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. కానీ ఈ దందా మొత్తం ఇప్పుడు అసాంఘిక శక్తులకు అనువుగా మారింది.
పిడిఎస్ దందా దిగితే సులువుగా కాసులు కూడబెట్టొచ్చే ఆలోచన కు వస్తున్నారు.ఆలస్యంగా నైన పసిగట్టిన పోలీసులు ఇప్పుడు ఈ దందా వెనుక ఉన్న అసాంఘిక శక్తుల భరతం పట్టే పనిలో దిగింది. ముందుగా కింగ్ పిన్ ల కార్యకలాపాలమీద ఫోకస్ పెట్టింది.
ఇందులో బాగంగానే బోధన్ లో ఓ రైస్ మిల్ కు చెందిన గోదాం లో గత రాత్రి సీసీఎస్ పోలీసులు మెరుపు దాడి చేసి భారీఎత్తున బియ్యం నిల్వలను స్వాధీనం చేసుకున్నారు. ఇది మిల్లర్ ముసుగు లో రెండు దశాబ్దాలుగా పీడీఎస్ దందా సాగిస్తున్న వ్యక్తి కి చెందినదిగా గుర్తించారు.
అలాగే నగరంలోని నాలుగవ పట్టణ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మెకానిక్ షెడ్డులో సుమారు 8.5 కింటల్స్ పిడిఎస్ బియ్యము మరియు పిడిఎస్ బియ్యం తరలించడానికి ఉపయోగించిన స్కూటీ అదుపులోకి తీసుకొని మీర్జా అబ్బాస్ బేగ్ ను అదుపులోకి తీసుకున్నారు
