Tuesday, April 28, 2026
HomeTelanganaNizamabadమాదవనగర్ వంతెన కు నిధులు ఇవ్వకపోతే పది రోజుల్లో దీక్షకు దిగుతా..నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు...

మాదవనగర్ వంతెన కు నిధులు ఇవ్వకపోతే పది రోజుల్లో దీక్షకు దిగుతా..నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ అల్టిమేటం

మాధవ నగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణ పనుల విషయం తేల్చకుంటే దీక్షకు దిగుతానని రాష్ట్ర ప్రభుత్వానికి నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ అల్టిమేటం జారీ చేశారు. బుధవారం జిల్లా బిజెపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.

నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో జరిగే ఆర్ ఓ బి పండుగ విషయంలో కేంద్రమే మీ నిధులు ఆలస్యం చేసిందని ఇటీవల నిజామాబాద్ వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిసిసి మహేష్ అన్నారని ఆగ్రహించారు.

ఈ నేపథ్యంలో పార్లమెంట్ సభ్యులు ఆర్వోబీ పనుల నిధులపై లెక్కలు తేల్చి చెప్పారు. మామిడిపల్లి ఆర్ఓబి కి మొత్తం రూ 22 అయ్యాయని అందులో సుమారు 18 కోట్లు ఏళ్ల క్రితం విడుదల చేశారని అన్నారు.ఇక అర్సపల్లి ఆర్వీబీ కి మొత్తం 137 కోట్ల రూపాయల కోసం కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే సగం నిధులు మంజూరు చేశామన్నారు.

అదేవిధంగా మాదవ నగర్ ఆర్వోబీ పనుల కోసం సుమారు రూ 60 కోట్ల అంచనా అయ్యిందని అందులో కేంద్రం ఇప్పటికే రూ 34 కోట్లు విడుదల చేసిందని తెలిపారు. ఇటీవల నిజామాబాద్ పర్యటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కేంద్రం నుంచి వచ్చే నిధులే రావడంలేదని అన్నారని గుర్తు చేశారు.

కేవలం కేంద్ర ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. వారం రోజుల్లో మొదల బ్రిడ్జి పనుల విషయంలో తేల్చకుంటే నిరాహార దీక్షకు దిగుతానని ప్రభుత్వానికి అల్టిమేట్ జారీ చేశారు.

ఇప్పటివరకు ఇప్పుడు కూడా నిరాహార దీక్షకు దిగలేనని మాధవ్ నగర్ ఆర్ఓబి విషయంలో కచ్చితంగా నిరాహార దీక్ష చేపడతామని ఆయన హెచ్చరించారు.పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సబ్జెక్టు తెలుసుకోనీ మీడియా ముందుకు వచ్చి మాట్లాడాలని పేర్కొన్నారు.

అలాగే జిల్లా అధికారులు కూడా కాంట్రాక్టు విషయంలో నిధులు మంజూరు చేయడం లేదని అధికారులు సక్రమంగా తమ బాధ్యతలు నడుచుకోవాలని తెలిపారు. జిల్లా కలెక్టర్ రాష్ట్ర ప్రభుత్వం నుండి వచ్చే ప్రెషర్ కు ఆర్ఓబి పనుల విషయంలో జాప్యం చేయకూడదని తమ పనులు తాము తక్షణమే చేయాలని తెలిపారు.

ఇక స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కేవలం బిజెపి పై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. బీసీ రిజర్వేషన్లపై ఢిల్లీలో నిర్వహించిన నిరసనలో రాహుల్ గాంధీ వచ్చాడా అని ప్రశ్నించారు.

ఎన్నికల సమయంలో బిజెపికి అడిగి వాగ్దానం ఇచ్చారా? ఇచ్చిన వాగ్దానాలలో ఎన్ని నెరవేర్చాలని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం కాలేశ్వరం విషయంలో ఎందుకు కల్వకుంట్ల కుటుంబంపై యాక్షన్ తీసుకోవడం లేదని ప్రశ్నించారు.

సిబిఐకి అప్పగించి చేతులు దులుపుకుంటున్నారని అన్నారు. బీఆర్ఎస్ హయంలో బోధనలో ఒకే కుటుంబంలో 42 దొంగ పాస్పోర్ట్ లు అయ్యాయని తెలిపారు. ఓటు బ్యాంకు రాజకీయం కోసమే గతంలో జూబ్లీ హిల్స్ లో దొంగ ఓట్లు ఎన్రోల్మెంట్ చేశారని మండిపడ్డారు.

ఇక జూబ్లీహిల్స్ లోని అత్యధికంగా డ్రగ్స్ సరఫరా అయ్యిందని అది కూడా కేటీఆర్ కెసిఆర్ హయాంలోని జరిగిందని ఆరోపణలు చేశారు. జూబ్లీహిల్స్ లో ఎవరి కనీసనాలలో ఈ డ్రెస్ దందా సాగిందని పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ లో టిఆర్ఎస్ నాయకులు ఎవరు అని ప్రశ్నించారు.

అత్యధికంగా జూబ్లీహిల్స్ లో క్లబ్లో జరిగే డ్రగ్స్ కేసులో సినీ నటులపై కేసులు నమోదైతే వారినీ ఇడిపించింది కెటిఆర్ కదా అని ప్రశ్నించారు. నిజామాబాద్ లో పసుపు బోర్డు ఏర్పాటై పక్షం రోజులు గడుస్తున్న ఇప్పటికీ పసుపు బోర్డు కార్యాలయానికి ఎక్కడ కూడా భూమి చూపించడం లేదని ఆగ్రహించారు.

ఈ కార్యక్రమంలో పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి. అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు స్రవంతి రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!