జిల్లాలో కేంద్రం ప్రభుత్వ నిధులతో సాగుతున్న ఆర్వోబీ పనుల నత్తనడకన సాగుతుండడం రాజకీయ రచ్చకు దారి తీసింది. ఈ వివాదం ఎంపీ అర్వింద్ వర్సెస్ పీసీసీ చీఫ్ మహేష్ లు మారింది.
జిల్లాకు వచ్చిన వారు ఒకరిమీద ఒకరు దుమ్మెత్తి పోసుకున్నారు. మాదవనగర్ వద్ద రైల్వే లైన్ మీద వంతెన నిర్మణ పనులు నత్తనడకన సాగుతున్నాయి ప్రజల్లో అసహనం వ్యక్తం అవుతుంది.
రాష్ట్రప్రభుత్వ తన వాటా నిధులు మంజూరు చేయడం లేదంటూ బీజేపీ నేతలు గత పది రోజుల క్రితమే వంతెన వద్ద ఆందోళన చేసారు. ప్రభుత్వ మొండి వైఖరి ని బీజేపీ నేతలు ఎండగట్టారు. రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి తల్లి దినకర్మ కు వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి కలవడానికి బీజేపీ ఎమ్మెల్యే రోడ్డు మీదే బైఠాయించారు.
చివరికి రేవంత్ కలిసి వినతి పత్రం ఇచ్చారు. ఈ వివాదం ఫై మరుసటి రోజు పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ స్పందించారు. అర్వింద్ ను టార్గెట్ చేసారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు వెంటనే ఇప్పించాలి కానీ లొల్లి చేస్తే ఎలా అంటూ మండిపడ్డారు.
ఆయన సంబంధింత అధికారులతోనూ వంతెన పనుల పురోగతి ని అరా తీశారు. రెండు తర్వాత జిల్లాకు వచ్చిన ఎంపీ అర్వింద్ సైతం గట్టిగా కౌంటర్ ఇచ్చాడు.
మాదవనగర్ ఒక్కటే కాదు జిల్లాలో కేంద్రం వాటా నిధులతో మంజూరు అయినా పనులకు రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధులు ఇవ్వడంలో ఎలా జాప్యం చేస్తుందో చెప్పారు.
మాదవనగర్ వంతెన పనులు రాష్ట్ర ప్రభుత్వ నిర్వాహకం వల్లే ఆగిపోయాయని పది రోజుల్లో నిధులు ఇవ్వకపోతే ఎంపీ గా తానే నిరాహార దీక్ష కు దిగుతానని అర్వింద్ అల్టిమేటం ఇచ్చారు అసలు తాను ఇప్పటిదాకా ఎప్పుడు దీక్ష చెయ్యలేదని కానీ వంతెన నిధులకు తప్పడం లేదని చెప్పారు.
అర్వింద్ ఎదురు దాడి కి ఇంకా కాంగ్రెస్ నుంచి ఎలాంటి కౌంటర్ మాత్రం రాలేదు. నిజానికి మాదవనగర్ రైల్వే ట్రాక్ వద్ద వంతెన పనులు ఏళ్ల తరబడిగా సాగుతుడడం తో రోజు హైదారాబాద్ వైపు వెళ్లే వేలాది మంది తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు.
గతంలో ఎంపీ అవ్వకముందే అర్వింద్ మాదవనగర్ వద్ద రైల్వే వంతెన డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు ఆయన ఎంపీ అవ్వగానే ఆరు నెలలోనే నిధులు మంజూరు చేయించారు.
కానీ అందులో రాష్ట్ర ప్రభుత్వ వాటా నిధులు తప్పనిసరి గా ఉండలని కేంద్రం మెలిక పెట్టింది. దీనితో అప్పటి నుంచే ఈ వంతెన రాజకీయ రచ్చ కు వేదిక అయింది.ఆర్ అండ్ బి మంత్రి ప్రశాంత్ రెడ్డి జిల్లాకు చెందిన వ్యక్తే అయినా వంతెన ఖ్యాతి అర్వింద్ రాకుండా సర్వశక్తులు ఒడ్డారు.
కానీ అప్పట్లో ను అర్వింద్ మరోసారి ఈ నిధుల కోసం రోడ్డెక్కడానికి సిద్ధం అయ్యారు. దీనితో ప్రభుత్వం నిధులను మంజూరు చేసింది. కానీ టెండర్ల పక్రియ దాటుకొని పనులు మొదలు కావడంలో నెలల తరబడి జాప్యం జరిగింది.
పనులే ఆలస్యంగా మొదలు పెట్టించిన సర్కార్ గుత్తేదారు కు నిర్ణిత కాలం లో బిల్లులు క్లియర్ చెయ్యలేక పోయింది. కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి రావడంతో ఎంపీ అర్వింద్ నేరుగా సీఎం రేవంత్ ను కల్సి గుత్తేదారు కు పెండింగ్ ఉన్న బిల్లులు క్లియర్ చేయించారు. దీనితో ఆరు నెలలు పనులు శరవేగంగా సాగాయి.
ఆ తర్వాత కథ మళ్ళీ మొదటికి వచ్చింది.ఆరు కోట్ల రూపాయల మేరకు బిల్లులు పెండింగ్ లో పడ్డాయి. రాష్ట్ర ప్రభుత్వం నిధులు వేగంగా మంజూరి చేస్తూ పనులు చేయిస్తే కేంద్రం నిర్ణిత గడువులోనే నిధులు మంజూరి చేస్తుందని అర్వింద్ చెప్తున్న మాట కానీ కేంద్రం ఇవ్వాల్సిన పండ్ నుఇవ్వక పోవడం వల్లే పనులు లేట్ అవుతున్నాయనేది అధికార పార్టీ నేతలు అంటున్నారు. మొత్తానికి ఈ వివాదం రాజకీయ రగడ కు దారి తీసేలా ఉంది.
