HomeCRIMEవడ్ల కుప్పను ఢీకొని యువతి మృతి

వడ్ల కుప్పను ఢీకొని యువతి మృతి

రోడ్డు మీద ఆరబోసిన వడ్ల కుప్పను ఢీ కొని ఓ యువతి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన మోస్రా మండంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే..నిజామాబాద్ నగరంలోని నాందేవ్వాడకు చెందిన దేవిరెడ్డి ఆదివారం తన సోదరితో కలిసి మోస్రాలోని బంధువుల ఇంటికి వెళ్లారు.

తిరిగి రాత్రి సమయంలో స్కూటీపై నిజామాబాద్‌కు వస్తుండగా మోస్రా శివారులో రోడ్డుపై ఉన్న వడ్ల కుప్పను వీరి వాహనం బలంగా ఢీకొట్టింది. ఈ క్రమంలో వెనుక కూర్చున్న దేవిరెడ్డి వాహనంపై నుంచి రోడ్డుపై పడటంతో తలకు బలమైన గాయాలయ్యాయి.

స్థానికులు వెంటనే స్పందించి ఆమెను ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందారు. వర్ని పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments