తాళం వేసి ఉన్న ఓ ఇంట్లో చోరీ యత్నం జరిగింది. ఈ ఘటన నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గుండారంలో చోటు చేసుకుంది. ఎస్ఐ అరీఫ్ వివరాల ప్రకారం.. గుండారం గ్రామానికి చెందిన స్వర్గం లక్ష్మి బుధవారం అదే గ్రామంలో ఉన్న చుట్టాల ఇంట్లో నిద్రించడానికి వెళ్లింది.
భర్త మరణించడంతో కుమారుడు పని నిమిత్తం గల్ఫ్ ఉంటారు. ఈ మేరకు బుదవారం రాత్రి ఓ గుర్తు తెలియని దుండగుడు ఇంటి తాళాలు పగలగొట్టి ఇంట్లోకి చొరబడ్డాడని తెలిపారు. బీరువాలోని లాకర్ పగల లేదని పేర్కొన్నారు.
దీంతో బీరువాలో మూడున్నర తులాల బంగారం, ఉందని బాధితులు అంటున్నారని తెలిపారు.బాధితుల ఫిర్యాదు మేరకు రూరల్ ఎస్ఐ అరీఫ్ సంఘటన స్థలానికి చేరుకుని క్లూస్ టీం ఆధారంగా వివరాలు సేకరిస్తున్నట్లు తెలిపారు. ఇంట్లో ఉన్న సీసీ కెమెరా రికార్డును పరిశీలిస్తున్నారు.
