నగరంలోని సెంట్రల్ జైలు వెనక ఉన్న అటవీ ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తి చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన నగరంలోని ఆరవ టౌన్ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది.
మృతుని వయస్సు సుమారు 35 సంవత్సరాలు ఉంటాయని స్థానికులు తెలిపారు.స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
