Thursday, April 16, 2026
HomeTelanganaNizamabadజిల్లా విద్యా రంగానికి వ్యవసాయ కళాశాల మకుటం లాంటిది--తెలంగాణ విశ్వవిద్యాలయ పూర్వ విద్యార్థి సంఘం అధ్యక్షుడు...

జిల్లా విద్యా రంగానికి వ్యవసాయ కళాశాల మకుటం లాంటిది–తెలంగాణ విశ్వవిద్యాలయ పూర్వ విద్యార్థి సంఘం అధ్యక్షుడు పంచ రెడ్డి చరణ్

నిజామాబాద్ జిల్లాకు వ్యవసాయ కళాశాల విద్యా రంగానికి మకుటం లాంటిదని తెలంగాణ విశ్వవిద్యాలయ పూర్వ విద్యార్థి సంఘం అధ్యక్షుడు పంచ రెడ్డి చరణ్ పేర్కొన్నారు.

ఈ మేరకు శుక్రవారం నగరంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడుతూ….జిల్లాకు వ్యవసాయ కళాశాల మంజూరు చేయడంలో కీలకపాత్ర పోషించిన టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కి, బోధన్ శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డికి, రూరల్ శాసనసభ్యులు భూపతి రెడ్డికి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ శాఖల ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీకి విశ్వవిద్యాలయ పూర్వ విద్యార్థుల సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని ఆయన అన్నారు.

జిల్లా విద్యారంగ అభివృద్ధి కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని మరోసారి రుజువైందని 2004 నుండి2014 వరకు గల కాంగ్రెస్ ప్రభుత్వంలో తెలంగాణ విశ్వవిద్యాలయం మెడికల్ కళాశాల ఏర్పాటుచేసి విద్యారంగం పట్ల కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి చాటుకుందని మరోసారి 2023 లో ఏర్పాటైన ప్రజా ప్రభుత్వంలో తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్ కళాశాల వంటివి ఏర్పాటు చేయడమే కాకుండా ఎంతో ప్రతిష్టాత్మకమైన వ్యవసాయ కళాశాలను జిల్లాకు మంజూరు చేసి జిల్లాలో విద్యారంగా అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ ఎనలేని కృషి చేస్తుందని ఆయన అన్నారు.

గత పది సంవత్సరాల బిఆర్ఎస్ పాలనలో నిజామాబాద్ జిల్లాలో విద్యారంగ అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని, ఇప్పుడు ఏర్పడిన కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో జిల్లా విద్య రంగానికి ఊతం అందిందని ఆయన అన్నారు .


జిల్లా విద్యా రంగానికి వ్యవసాయ కళాశాల మకుటం లాంటిదని , వ్యవసాయ కళాశాలను జిల్లాకు మంజూరు చేయించడంలో టిపిసిసి అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ కీలక పాత్ర పోషించారని పిసిసి పగ్గాలు చేపట్టినప్పటి నుండి జిల్లాపై మహేష్ కుమార్ గౌడ్ తనదైన మార్క్ తో నిజామాబాద్ జిల్లాలో అభివృద్ధికి తోడ్పడుతున్నారని ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేశారని, అలాగే ఇప్పుడు జిల్లాకు వ్యవసాయ కళాశాలను మంజూరు చేయించారని ఆయన పేర్కొన్నారు.

రాష్ట్రంలో వ్యవసాయ ఆధారిత జిల్లాగా పేరుపొందిన నిజామాబాద్ జిల్లాలో వ్యవసాయ కళాశాల వల్ల ఇక్కడ అనేక పరిశోధనలు జరిగి వ్యవసాయ రంగంలో నూతన విప్లవానికి నాంది పలుకుతుందని భవిష్యత్తులో వ్యవసాయ కళాశాల ద్వారా కొత్త వంగడాలు సృష్టించాలని అనేకమంది వ్యవసాయ శాస్త్రజ్ఞులు తయారు కావాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో దత్తు సతీశ్ రమేష్ మీరన్ అలీ అయూబ్,విశాల్ జగన్,ధనుష్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!