రోకలిబండతో మోది భర్త తన భార్యనుహతమార్చాడు. ఈ ఘటన పెద్ద కొడప్గల్ లోని విట్టల్ వాడి తండాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
విట్టల్ వాడి తండాకు చెందిన కిషన్ కు 25 సంవత్సరాల క్రితం పవర్ సవిత తో వివాహమైంది. వారికి ప్రస్తుతం ఒక కొడుకు కూతురు సంతానం కలరు. కుటుంబం మొత్తం గత కొన్ని సంవత్సరాల నుండి హైదరాబాదులోని
లింగంపల్లి ప్రాంతంలో చాయ్ కొట్టు పెట్టుకొని అక్కడే జీవిస్తుండేవారు.అప్పుడప్పుడు ఇంటిదగ్గర ఏదైనా కార్యక్రమాలు లేదా పండగలు ఉంటే విటల్వాడి తండాకు వచ్చేవారు గత కొన్ని సంవత్సరాలుగా కిషన్ మద్యానికి బానిసై తన భార్య ను అనుమానిస్తూ ఇష్టం వచ్చినట్టు కొట్టేవాడు రెండు రోజుల క్రితం విటల్వాడి తండాలో గుడి పండుగ ఉన్నదని ఆ కుటుంబం విటల్వాడి తండాకు వచ్చినారు
ఈ మేరకు గురువారం రాత్రి సమయంలో ఇద్దరు భార్యాభర్తలు గొడవ పడగా భర్త ఆయన కిషన్ సవితను రుబ్బురాయి రోలు తో తలపై కొట్టగా ఆమెకు బలమైన గాయమైనదను స్థానికులు తెలిపారు.అలాగే ఆపడానికి వచ్చిన తాండవాసులను కూడా కిషన్ గాయపరిచినట్లు తెలిపారు.
రక్తపు మడుగులో కొనవుపిరితో ఉన్న సవితను హుటాహుటిన బాన్సువాడ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందినట్లు తెలిపారు.కుటుంబ సభ్యుల ఫిర్యాధు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు బిచ్కుంద సీఐ రవికుమార్, ఎస్సై అరుణ్ కుమార్ తెలిపారు.
