Saturday, May 2, 2026
HomeTelanganaNizamabadరూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి అండతో మైనింగ్ దందా.. బిజెపి జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్...

రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి అండతో మైనింగ్ దందా.. బిజెపి జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ కులాచారి ఆరోపణ..

నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని మల్కాపూర్ లో ఎమ్మెల్యే భూపతి రెడ్డి అండతో మైనింగ్ దందా ఇష్టారీతిన గుట్టను తోడేస్తున్నారనీ బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి ఆరోపించారు.

ఈ మేరకు శుక్రవారం బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి మొరం క్యారీలను పరిశీలన చేశారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ భూముల్లో అక్రమ మొరం తవ్వకాలు జరుగుతున్నాయని తెలిపారు.

ఈ దందాకు రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి ప్రోత్సాహం ఉందని ఆరోపించారు. ప్రభుత్వం ప్రజల కోసం భూములు కేటాయించింది కానీ కాంగ్రెస్ నేతలు దోపిడీకి దిగారు అన్నారు. మల్కాపూర్, జాన్కంపేట్, ప్రాంతాల్లో మొరం మాఫియా పంజా వేసిందన్నారు.

రోడ్డుపై వందలాది టిప్పర్లు తిరుగుతూ ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నారని చెప్పారు. పిల్లలు, వృద్ధులు, మహిళలు దుమ్ము దులిలో శ్వాస తీసుకోవడానికీ ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు.రూరల్ ఎమ్మెల్యే ప్రజల కోసం పనిచేయాల్సింది పోయి అవినీతి దందాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.

రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి లేక అవినీతి మాత్రం పెరిగిపోయిందన్నారు.రోడ్లు చెదిరిపోయాయి, చెరువులు ఎండిపోయాయి, ప్రజల గోస ఎవరూ వినడం లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పరాకాష్టకు చేరిందని విమర్శించారు.

ఇంచార్జి మంత్రులు కేవలం ఫోటోలు, ప్రకటనలకే పరిమితమయ్యారని ఎద్దేవా చేశారు. జిల్లాలో ప్రజలు ఇబ్బంది పడుతున్న పట్టించుకున్న నాథుడే లేడని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి క్వారీలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.లేకపోతే బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళన, ధర్నాలు చేస్తామని హెచ్చరించారు.అధికారులు ఎమ్మెల్యే పాదసేవకులుగా కాకుండా ప్రజల పక్షాన ఉండాలని హితవు పలికారు.

ఒక అధికారి “ఎంఎల్ఏ చెప్తేనే పర్మిషన్ ఇస్తా” అని చెప్పడం సిగ్గుచేటు అని దుయ్యబట్టారు. అధికారుల అనుమతితో అవినీతి నడుస్తుంటే ప్రజాస్వామ్యం దెబ్బతింటుందన్నారు.ఈ సందర్భంగా ఎమ్మార్వో ఆడియో కాల్‌ను మీడియా ముందు విడుదల చేశారు.దానిపై విచారణ జరిపి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని అధికారులను డిమాండ్ చేశారు.

భూపతి రెడ్డి వెంటనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని దినేష్ పటేల్ డిమాండ్ చేశారు.లేకపోతే ప్రజలు రాబోయే రోజుల్లో తగిన శిక్ష చెప్తారని హెచ్చరించారు.ప్రజల హక్కుల కోసం భారతీయ జనతా పార్టీ ఎప్పటికీ వెనక్కి తగ్గదు.అధికారాన్ని అడ్డుపెట్టుకొని పేదలను బెదిరించాలని చూస్తే చూస్తూ ఊరుకోం.

దినేష్ పటేల్ కులాచారి గారు స్పష్టం చేశారు.ఈ కార్యక్రమం లో రూరల్ కన్వీనర్ పద్మారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు రాంచందర్,శంకర్ రెడ్డి,మండల అధ్యక్షులు ఆనంద్,కూరెళ్ల శ్రీధర్,నాయిడి రాజన్న, గోపి, ఓం సింగ్,యాదల నరేష్,అమందు విజయ్ కృష్ణ, వినోద్ రెడ్డి, శ్రీధర్ బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!