వైద్యుల నిర్లక్ష్యం తో అప్పుడే పుట్టిన బిడ్డ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటన నగరంలోని మనోరమ ఆస్పత్రిలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం..
కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ కు చెందిన ఆసిఫ్ తన భార్య సల్మా ను డెలివరీ నిమిత్తం ఆస్పత్రికి తీసుకువచ్చారనీ తెలిపారు. ఈ ఆసుపత్రి నందు ఇద్దరు కవల పిల్లలు జన్మించగా ఒకరు 700 గ్రాములు, మరొకరు ఒకటిన్నర కిలోలు జన్మించినట్లు తెలిపారు.
దీంతో ఒకటిన్నరకిలో ఉన్న శిశువుకి ఆరోగ్యం తటస్థంగా ఉందని మరొక శిశువుని హైదరాబాద్ నీలోఫర్ ఆసుపత్రికి తరలించాలని తెలిపారు. అదేవిధంగా ఆసిఫ్ యొక్క కుటుంబ సభ్యులు నీలోఫర్ ఆసుపత్రికి తరలించారు.
మరుసటి రోజే ఆ శిశువు మృతి చెందడంతో మరొక శిశువు ఎలాగైనా బతికించుకోవాలని అన్ని విధాలుగా ప్రయత్నాలు చేశారని అన్నారు. కానీ ఆసుపత్రి నందు వైద్యం పేరుతో వారిచే బిల్లును కట్టించుకున్నారు. కాగా శుక్రవారం ఉదయం 6 గంటలకు ఆరోగ్యం విషమంగా ఉందని ఉన్నఫళంగా హైదరాబాద్ తీసుకువెళ్లాలని సూచించారు.
హైదరాబాదులోని కిమ్స్ ఆసుపత్రికి తరలి తరలించండి అంబులెన్స్ మాట్లాడతానని తెలిపి వారే స్వయంగా అంబులెన్స్ మాట్లాడారు. అంబులెన్స్ పేరిట మరో పది వేలు తీసున్నారని తెలిపారు. అంబులెన్స్ హైబరాబాద్ నుంచే వస్తున్నట్లు తెలిపారు.
దీంతో అప్పటికే మీ శిశువు మరణించినట్టు ఆసిఫ్ కు తెలపడంతో కంగుచున్నారు. అదే మొదటి రోజు చెబితే మేము హైదరాబాద్ తీసుకెళ్లే వాళ్ళము కదా అని కుటుంబ సభ్యులు డాక్టర్ని నిలదీయగా మేనేజ్మెంట్ ని కలిసి మాట్లాడండనీ తప్పించున్నారని తెలిపారు.
దీంతో అప్పుడే పుట్టిన ఇద్దరు శిశువులు మృతి చెందడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటుతున్నాయి.
