బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి కి శుక్రవారం నిరసన సెగ తగిలింది. ఆయన బోర్లం గ్రామానికి వస్తున్నారని తెలిసి ప్లకార్డు లతో నిరసన వ్యక్తం చేశారు.
బి ఆర్ ఎస్ పార్టీ గుర్తు పైనా గెలిచి కాంగ్రెస్ పార్టీ లో చేరినందుకు ఆపార్టీ నేతలు నిరసన కు దిగారు పోచారం శ్రీనివాస్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ తరుపున పోటీ చేయాలని వారు సవాల్ చేసారు అనంతరం పోలీసులు వారిని బాన్సువాడ పోలీస్ స్టేషన్ కు తరలించారు.
ఈ కార్యక్రమములో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ జుబేర్, మన్నె అనిల్, లక్ష్మణ్, గంగారం,రాంచందర్, సాయిలు, రాజ్ కుమార్, హన్మంత్, రమేష్, విజయ్ కుమార్, రాజు ఫోటో గంగాధర్, నర్సింలు, శ్రీను, దిలీప్ బీఆర్ ఎస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
