బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలంటూ తెలంగాణ జాగృతి ఆద్వర్యంలో రైలు రోకో నిర్వహించారు. ఈ మేరకు జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కామరెడ్డి వద్ద రైలు పట్టాల పై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.
రైలు రోకో నేపథ్యంలో సిర్నపల్లి – ఇందల్వాయి మధ్య దేవగిరి ఎక్స్ ప్రెస్ రైలు నిలిచిపోయింది. బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం రైలు రోకో చేపట్టిన తెలంగాణ జాగృతి నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు.
