HomeCRIMEపోలీస్ వాహనానికి మృతదేహం కట్టి నిరసన

పోలీస్ వాహనానికి మృతదేహం కట్టి నిరసన

మృతి చెందిన యువకుడి మృతదేహాన్ని పోలీస్ పెట్రోలింగ్ కారుపై కట్టేసి కుటుంబ సభ్యులు ఆందోళన చేశారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలోని ఎర్గట్ల మండలంలో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళ్లితే..ప్రేమించి మోసపోయానన్న మనస్తాపంతో దొంచందా గ్రామానికి చెందిన శ్రీకాంత్ రెడ్డి ఈ నెల 6న యువకుడు ఇంట్లోనే పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించినా, చికిత్స పొందుతూ మృతి చెందారు.

దీంతో మృతుడి బంధువులు, గ్రామస్థులు శవంతో కలిసి పోలీస్ స్టేషన్ ముట్టడికి ప్రయత్నించగా మద్యలోనే పోలీసులు వారిని అడ్డుకున్నారు.

తీవ్ర భావోద్వేగంతో ఉన్న కుటుంబ సభ్యులు మృతదేహాన్ని పోలీస్ వాహనం పై తాళ్లతో కట్టేసి తమ నిరసన తెలియజేశారు.ఈ ఘటనతో గ్రామంలో ఒక్కసారిగా తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments