HomeLaw and Orderఅవినీతి రహిత సమాజాన్ని నిర్మిద్దాం..!నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ...

అవినీతి రహిత సమాజాన్ని నిర్మిద్దాం..!నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య …

అవినీతి రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరు పాటుపడాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు.

అందుకోసం ప్రతి ఒక్కరూ తనకు తానుగా నిజాయితీతో మెలుగుతూ, తమ చుట్టూ ఉన్న అవినీతి గురించి సంబంధిత శాఖలకు సమాచారం ఇచ్చి, దేశాభివృద్ధికి తమ వంతు కృషి చేయాలని వివరించారు.

అవినీతి నిరోధక శాఖ వారోత్సవాల సందర్భంగా శుక్రవారం విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ పాత కలెక్టరేట్లో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ .

సాయి చైతన్య జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అవినీతి రహిత సమాజం కోసం నినాదాలు చేస్తూ ప్రజలను భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

కరప్షన్ వల్ల వచ్చే నష్టాలు, ఇబ్బందులు, ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఇలాంటి ర్యాలీల ద్వారా ప్రజలను అవగాహన కల్పిస్తున్నామన్నారు. యాంటి కరప్షన్ బ్యూరో ద్వారా క్యూ ఆర్ కోడ్ రిలీజ్ చేయడం జరిగిందని , క్యూఆర్ కోడ్ ద్వారా ఫిర్యాదులు సమాచారం అందించవచ్చని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

కరప్షన్ అనేది షార్ట్ కట్ కాదు ఒక క్రైమ్ అని అలాంటివి జరిగినప్పుడు ప్రజలు స్పందించి సమాచారం అందించి అరికట్టాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో నిజామాబాద్ డిసిపి ( అడ్మిన్ )బస్వా రెడ్డి, అవినీతి నిరోధక శాఖ డిఎస్పి శేఖర్ గౌడ్ , ఏసీబీ అధికారులు, సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments